మార్చి 11న రానున్న హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా, తమ సరికొత్త 150సీసీ మోటార్‌సైకిల్‌ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. ఇటు ఆఫ్-రోడ్ ప్రియులను అటు ఆన్-రోడ్ ప్రియులను ఆకట్టుకునేలా కంపెనీ అభివృద్ధి చేసిన 'హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్' అనే స్ట్రీట్ మోటార్‌సైకిల్‌ను హోండా ఈనెల 11న (మార్చి 11, 2013) మార్కెట్లో విడుదల చేయనుంది.

గడచిన సంవత్సరం ఇండోనేషియాలో జరిగిన 2012 జకార్తా మోటార్ షోలో కంపెనీ తొలిసారిగా ఈ హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. భారత వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను దృష్టిలో ఉంచుకొని హోండా ఈ పవర్‌ఫుల్, స్టయిలిష్, స్లీక్ 150సీసీ బైక్‌‌ను తయారు చేసింది. హోండా తాజాగా మార్కెట్లో విడుదల చేసిన సిబిఆర్150ఆర్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్ బైక్‌ను అభివృద్ధి చేసింది.

అయితే, హోండా సిబిఆర్150ఆర్ స్పోర్ట్స్ బైక్ వెర్షన్ కాగా, అందుకు నేక్డ్ వెర్షనే ఈ హోండా సిబి150ఆర్ (డిజైన్ పరంగా ఈ రెండు మోడళ్లు వేర్వేరుగా ఉంటాయి). హోండా సిబి1000ఆర్ సూపర్‌బైక్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన ఈ బైక్‌లో శక్తివంతమైన 149.4సీసీ, డిఓహెచ్‌సి, 4-వాల్వ్, సింగిల్ సిలిండర్-లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 18 బిహెచ్‌పిల శక్తిని, 12.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఆరు గేర్లు) సిస్టమ్‌తో లభిస్తుంది.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

మార్చి 11, 2013న హోండా తమ కొత్త 150సీసీ బైక్ సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్‌ను విడుదల చేయనుంది.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా తాజాగా మార్కెట్లో విడుదల చేసిన సిబిఆర్150ఆర్ ఫ్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్ బైక్‌ను అభివృద్ధి చేసింది.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్ స్ట్రీట్ మోటార్‌సైకిల్‌ను గడచిన సంవత్సరం ఇండోనేషియాలో జరిగిన 2012 జకార్తా మోటార్ షోలో హోండా ఆవిష్కరించింది.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబిఆర్150ఆర్ స్పోర్ట్స్ బైక్ వెర్షన్ కాగా, ఇందుకు నేక్డ్ వెర్షనే ఈ హోండా సిబి150ఆర్ (డిజైన్ పరంగా ఈ రెండు మోడళ్లు వేర్వేరుగా ఉంటాయి).

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి1000ఆర్ సూపర్‌బైక్ నుంచి స్ఫూర్తి పొంది దీనిని డిజైన్ చేశారు.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

ఇందులో హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌ఫైర్ మోటార్‌సైకిల్‌లో శక్తివంతమైన 149.4సీసీ, డిఓహెచ్‌సి, 4-వాల్వ్, సింగిల్ సిలిండర్-లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 18 బిహెచ్‌పిల శక్తిని, 12.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఆరు గేర్లు) సిస్టమ్‌తో లభిస్తుంది.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

సిబిఆర్150ఆర్ బైక్‌లో ఉపయోగించిన ఫ్రేమ్, ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్‌లనే సిబి150ఆర్ బైక్‌లోను ఉపయోగించనున్నారు.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

ఇది నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో (వైట్, బ్లాక్, ట్రైకలర్, ఆరెంజ్) లభ్యం కానుంది.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

స్ట్రీట్ బైక్ ఫీల్‌ను కలిగించేలా దీని ఎర్గోడైనమిక్స్‌ను డిజైన్ చేశారు.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

భారత మార్కెట్లో దీని ధర రూ.99,000 (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌

హోండా సిబి150ఆర్ స్ట్రీట్‌బైక్‌


సిబిఆర్150ఆర్ బైక్‌లో ఉపయోగించిన ఫ్రేమ్, ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్‌లనే సిబి150ఆర్ బైక్‌లోను ఉపయోగించనున్నారు. స్ట్రీట్ బైక్ ఫీల్‌ను కలిగించేలా దీని ఎర్గోడైనమిక్స్‌ను డిజైన్ చేశారు. ఇది నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో (వైట్, బ్లాక్, ట్రైకలర్, ఆరెంజ్) లభ్యం కానుంది. దేశీయ విపణిలో బజాజ్ అందిస్తున్న పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌కు ఇది గట్టి పోటీగా నిలువనుంది. హోండా అందిస్తున్న సిబిఆర్150ఆర్ ధరను కంపెనీ ఇప్పటికే అధికంగా ఉంచిన నేపథ్యంలో, ఈ సిబి150ఆర్ స్ట్రీట్ బైక్ ధరను తక్కువగా ఉంచాల్సిన అసరం ఉంది. భారత మార్కెట్లో దీని ధర రూ.99,000 (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
According to sources, Honda Motorcycle and Scooter India has all set to launch its all-new 150cc street bike in this month. Honda has revealed the CB150R at 2012 Jakarta Motor Show, Indonesia.
Story first published: Wednesday, March 6, 2013, 12:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X