హోండా యునికార్న్ 160 విడుదల; ధర రూ.69,350

By Ravi

జపాన్‌కి చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ), యునికార్న్ బ్రాండ్‌లో ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ నేడు (డిసెంబర్ 18, 2014) తమ సరికొత్త స్టయిలిష్ హోండా సిబి యునికార్న్ 160 మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది.

దేశీయ విపణిలో హోండా సిబి యునికార్న్ 160 రెండు వేరియంట్లలో (స్టాండర్డ్, సిబిఎస్ - కాంబి బ్రేకింగ్ సిస్టమ్) లభ్యం కానుంది. వాటి ధరలు ఇలా ఉన్నాయి:

  • సిబి యునికార్న్ 160 (స్టాండర్డ్) - రూ.69,350
  • సిబి యునికార్న్ 160 (సిబిఎస్) - రూ.74,414

(రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

యునికార్న్ 150తో పోల్చుకుంటే కొత్త యునికార్న్ 160 మరింత మోడ్రన్ డిజైన్‌ని కలిగి ఉంటుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టయిలిష్ ఫ్యూయెల్ ట్యాంక్, 3డి హోండా యాంబ్లం, H డిజైన్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ వంటి డిజైన్ మార్పులు ఉన్నాయి.

Honda Unicorn 160 Launched

ఇంకా ఇందులో కొత్తగా కాంబి బ్రేక్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు 240 మి.మీ. డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఈ సిబిఎస్ వేరియంట్‌లో ఫ్రంట్ బ్రేక్ లేదా రియర్ బ్రేక్‌ను అప్లయ్ చేసినప్పుడు రెండు బ్రేకులు అప్లయ్ అవుతాయి.

ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో హెచ్ఈటి (హోండా ఈకో టెక్నాలజీ)తో అభివృద్ధి చేసిన కొత్త 162.71సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్‌కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8000 ఆర్‌పిఎమ్ వద్ద 14.5 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 14.61 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది లీటరుకు 62 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

Most Read Articles

English summary
Honda Motorcycle and Scooters India (HMSI) has launched the much-awaited Unicorn 160 in two variants. The CB Unicorn 160 standard is priced at Rs 69,350 and the CB Unicorn 160 CBS (Combi-Brake system) is priced at Rs 74,414 (all prices ex-showroom, Delhi).
Story first published: Thursday, December 18, 2014, 14:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X