హోండా యాక్టివా 125 కోసం కొత్త యాడ్ క్యాంపైన్ షురూ

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ గడచిన ఏప్రిల్ నెలలో దేశీయ విపణిలో విడుదల చేసిన తమ మొట్టమొదటి 125సీసీ ఆటోమేటిక్ స్కూటర్ 'యాక్టివా 125'ను కోసం కంపెనీ ఓ కొత్త టెలివిజన్ కమర్షియల్‌ను రూపొందించింది. ఎంపిక చేసిన టెలివిజన్ చానెళ్లలో ఈ ప్రకటన ప్రసారం కానుంది. ఇప్పుడు ఈ వీడియోని కంపెనీ అఫీషియల్ యూట్యూబ్ చానెల్‌లో కూడా హోండా విడుదల చేసింది. ఈ నాటి మన వీడియో శీర్షికలో హోండా యాక్టివా 125 వాణిజ్య ప్రకటను చూద్దాం రండి.

ఆటోమేటిక్ స్కూటర్ విభాగంలో హోండా ఇప్పటికే మార్కెట్ లీడర్‌గా ఉన్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, యాక్టివా బ్రాండ్‌లో తాజాగా వచ్చిన 125సీసీ వేరియంట్ ఈ అమ్మకాలకు మరింత జోరును అందించనుంది. హోండా యాక్టివా 125 స్కూటర్ రెండు వెర్షన్లలో (స్టాండర్డ్, డీలక్స్) లభ్యం అవుతుంది. దీని ప్రారంభ ధర రూ.56,607 (ఎక్స్-షోరూమ్, ముంబై)గా ఉంది.

హోండా యాక్టివా 125లో పవర్‌ఫుల్ 124సీసీ, ఫోర్-స్ట్రోక్, ఫోర్స్ ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 125సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6500 ఆర్‌పిఎమ్ వద్ద 8.6 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.12 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ రెగ్యులర్ వి-మ్యాటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ మోడల్ కూడా హోండా హెచ్ఈటి టెక్నాలజీతో తయారు చేయబడినది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది లీటరుకు 59 కి.మీ. మైలేజీనిస్తుంది.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Fp91EtZ7uVA?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Honda Motorcycle & Scooter India Pvt. Ltd. (HMSI) commenced it’s new Ad campaign titled ‘Step-up’ for its latest entrant in the ATSC (Automatic Scooters) category Activa 125. The TVC is created by Dentsu Marcom and is running on air across channels.&#13;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X