అక్టోబర్‌లో విడుదల కానున్న హ్యోసంగ్ జివి250 బైక్

By Ravi

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హ్యోసంగ్, భారత మార్కెట్లో మరొక కొత్త బైక్‌‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇటీవలే కంపెనీ విడుదల చేసిన జివి650 బైక్‌కు దిగువన అదే సిరీస్‌లో తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఓ లీజర్ బైక్‌ను విడుదల చేస్తామని గతంలో కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, తాజా అప్‌డేట్ ప్రకారం హ్యోసంగ్ జివి250 క్రూయిజ్ వచ్చే రానున్న అక్టోబర్ నెల ఆరంభంల దేశీయ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ బైక్ చాలా రోజుల క్రితమే భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉంది, కానీ కొన్ని అంతర్గత కారణాల వలన దీని విడుదల విషయంలో జాప్యం జరిగింది. హ్యోసంగ్ తొలుత భారత్‌లో పూనేకు చెందిన గార్వారే మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకొని కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసినదే. అయితే, ఆ తర్వాత ఇరు సంస్థల మధ్య తలెత్తిన సమస్యల కారణంగా ఈ వెంచర్‌ను పూనేకు చెందిన మరొక సంస్థ డిఎస్‌కే మోటోవీల్స్‌ను హ్యోసంగ్ ఆశ్రయించింది.

హ్యోసంగ్ జివి250

డిఎస్‌కే మోటోవీల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న తర్వాత హ్యోసంగ్‌కు దేశీయ మార్కెట్లో బాగా కలిసొచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్న ఈ హ్యోసంగ్ జివి250 మోటార్‌సైకిల్ 800సీసీ ఇంజన్ సామర్థ్యం కన్నా తక్కువ ఉండి, అధనపు ఎక్సైజ్ సుంకాల పరిధిలోకి రాదు కాబట్టి, భారత మార్కెట్లో ఇది సరసమైన ధరకే లభించే అవకాశం ఉంది.

హ్యోసంగ్ జివి250లో ఉపయోగించిన 250సీసీ, ఆయిల్-కూల్డ్, వి-ట్విన్ ఇంజన్ గరిష్టంగా 28 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జచేయబడి ఉంటుంది. హ్యోసంగ్ తమ జివి250 బైక్‌ను స్థానికంగానే అసెంబ్లిగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఫలితంగా ఇది రూ.2.5 లక్షల ధరకే అందుబాటులోకి రావచ్చని అంచనా. హ్యోసంగ్ జివి250కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
Following the success of the GV650 cruiser bike South Korean motorcycle manufacturer Hyosung and its Indian partner DSK Motorwheels have decided to introduce the quarter liter model, GV250 in Indian market by early October.
Story first published: Saturday, August 31, 2013, 9:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X