ఆటో ఎక్స్‌పో 2014లో హ్యోసంగ్ ఆవిష్కరించనున్న కొత్త బైక్స్

By Ravi

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హ్యోసంగ్, పూనేకు చెందిన డిఎస్‌కే మోటోవీల్స్‌ ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించేందుకు ముస్తాబవుతున్నాయి.

గత కొద్దికాలంగా వాయిదా పడుతూ వస్తున్న హ్యోసంగ్ ఆక్విలా 250 క్రూయిజ్/లీజర్ స్టయిల్ బైక్‌ను 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో విడుదల చేయటంతో పాటుగా, మరిన్ని సరికొత్త ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఫిబ్రవరి 5, 2014వ తేది నుంచి ప్రారంభం కానున్న 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో హ్యోసంగ్ తమ జిడి250ఎన్ నేక్డ్ మోటార్‌సైకిల్‌ను మరియు ఓ సరికొత్త 125సీసీ బైక్‌ను ప్రదర్శించనుంది. ఈ బైక్‌లకు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హ్యోసంగ్ ఆక్విలా జివి250

హ్యోసంగ్ ఆక్విలా జివి250

హ్యోసంగ్ ఆక్విలా జివి250లో 250సీసీ, ఆయిల్-కూల్డ్, వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 28 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జచేయబడి ఉంటుంది.

హ్యోసంగ్ ఆక్విలా జివి250

హ్యోసంగ్ ఆక్విలా జివి250

హ్యోసంగ్ తమ జివి250 బైక్‌ను స్థానికంగానే అసెంబ్లిగ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. భారత మార్కెట్లో దీని ధర రూ.2.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. హ్యోసంగ్ జివి250కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

హ్యోసంగ్ జిడి250ఎన్

హ్యోసంగ్ జిడి250ఎన్

ఇకపోతే హ్యోసంగ్ ప్రదర్శించిన మరో నేక్డ్ బైక్ 'హ్యోసంగ్ జిడి250ఎన్'. ఈ బైక్‌లో 249సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 28 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జచేయబడి ఉంటుంది.

హ్యోసంగ్ జిడి250ఎన్

హ్యోసంగ్ జిడి250ఎన్

హ్యోసంగ్ జిడి250ఎన్‌లో ముందు వైపు 37 మి.మీ. ఇన్వెర్టెడ్ ఫోర్డ్ అప్ ఫ్రంట్ మరియు వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్లను అమర్చారు. దీని మొత్తం బరువు 145 కేజీలు. సికెడి రూట్లో దీనిని కూడా భారత మార్కెట్లోనే అసెంబ్లింగ్ చేసే అవకాశాలున్నాయి. భారత మార్కెట్లో దీని ధర రూ.1.75 లక్షలు ఉండొచ్చని అంచనా.

హ్యోసంగ్ ఆర్‍‌‌టి 125 డి

హ్యోసంగ్ ఆర్‍‌‌టి 125 డి

ఇక చివరగా.. హ్యోసంగ్ ఓ సరికొత్త 125సీసీ బైక్‌ను కూడా 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచనుంది. ఈ బైక్ పేరు 'హ్యోసంగ్ ఆర్‍‌‌టి 125 డి'. డర్ట్ బైక్ లుక్‌ను కలిగి ఉండే ఈ బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఫిబ్రవరి 5న కంపెనీ వెల్లడించనుంది.

 
Most Read Articles
English summary
Hyosung has a decent presence in India and are ever growing their product portfolio for the Indian customer. So far the Korean manufacturer has provided an alternative to bigger capacity bikes. This 2014 is going to be a mayhem of launches and reveals, Hyosung can't be too far away in the race and have decided to enthrall the crowds with three new products in the Indian market.
Please Wait while comments are loading...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X