ఇండియా బైక్ వీక్ 2015: వెస్పా జిటిఎస్ 300 స్కూటర్ ప్రదర్శన

By Ravi

ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం పియాజ్జియోకి చెందిన లగ్జరీ స్కూటర్ బ్రాండ్ వెస్పా తమ పవర్‌పుల్ 'వెస్పా జిటిఎస్ 300' (Vespa GTS 300) స్కూటర్‌ను గోవాలో జరుగుతున్న 2015 ఇండియా బైక్ వీక్‌‌లో ప్రదర్శనకు ఉంచింది.

వెస్పా జిటిఎస్ 300 స్కూటర్లో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ట్రాక్షన్ కంట్రోల్, కొత్త ఎన్‌హ్యాన్స్డ్ స్లైడింగ్ సస్పెన్షన్ (ఈఎస్ఎస్) మరియు వెస్పా మల్టీమీడియా ప్లాట్‌ఫామ్ వంటి ఫీచర్లున్నాయి. ఈ స్కూటర్ ప్రస్తుతం అమెరికా, యూరప్ దేశాల్లో అమ్ముడుపోతోంది.

వెస్పా జిటిఎస్ 300 స్కూటర్ మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను, ఫీచర్లను ఆఫర్ చేస్తూ వెస్పా 946 స్కూటర్ కన్నా తక్కువ ధరను కలిగి ఉంటుంది. ఈ పవర్‌ఫుల్ వెస్పా జిటిఎస్ 300 సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ ఫొటో ఫీచర్‌లో తెలుసుకోండి.

ఇండియా బైక్ వీక్ 2015: వెస్పా జిటిఎస్ 300 స్కూటర్ ప్రదర్శన

వెస్పా జిటిఎస్ 300 స్కూటర్‌కు సంబంధించి తర్వాతి స్లైడ్‌లలో మరిన్ని ఆసక్తికర విషయాలను చూడండి.

ఇండియా బైక్ వీక్ 2015: వెస్పా జిటిఎస్ 300 స్కూటర్ ప్రదర్శన

వెస్పా జిటిఎస్ 300 స్కూటర్ మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి - 1. వెస్పా జిటిఎస్ 300, 2. వెస్పా జిటిఎస్ 300 సూపర్.

ఇండియా బైక్ వీక్ 2015: వెస్పా జిటిఎస్ 300 స్కూటర్ ప్రదర్శన

వెస్పా జిటిఎస్ 300ఈ స్కూటర్‌లో పవర్‌ఫుల్ 278సీసీ సింగిల్ సిలిండర్, 4-వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 22 హెచ్‌పిల శక్తిని, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 21.69 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇండియా బైక్ వీక్ 2015: వెస్పా జిటిఎస్ 300 స్కూటర్ ప్రదర్శన

వెస్పా జిటిఎస్ 300లో ఉపయోగించిన ఏబిఎస్ సిస్టమ్ ముందు, వెనుక చక్రాలు ఎంత వేగంతో తిరుగుతున్నాయనేదాన్ని సెన్సార్ల ద్వారా గ్రహించి దానికి అనుగుణంగా పనిచేస్తాయి. ఈ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వలన బ్రేక్ వేసినప్పుడు స్కూటర్ జారిపోకుండా ఉంటుంది.

ఇండియా బైక్ వీక్ 2015: వెస్పా జిటిఎస్ 300 స్కూటర్ ప్రదర్శన

ఇందులోని ఎన్‌హ్యాన్స్డ్ స్లైడింగ్ సస్పెన్షన్ (ఈఎస్ఎస్) సిస్టమ్ ట్రెడిషనల్ వెస్పా సింగిల్ సైడెడ్ ఫ్రంట్ సస్పెన్షన్‌తో పనిచేస్తుంది. ఈ కొత్త సిస్టమ్ వలన రైడ్ కంఫర్ట్ మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఇండియా బైక్ వీక్ 2015: వెస్పా జిటిఎస్ 300 స్కూటర్ ప్రదర్శన

ఇందులోని వెస్పా మల్టీమీడియా ప్లాట్‌ఫామ్ సాయంతో మీ స్మార్ట్ ఫోన్‌ను స్కూటర్‌లోని ఆన్-బోర్డ్ సిస్టమ్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఉపయోగకరమైన, రియల్-టైమ్ సమాచారాన్ని అందిస్తుంది.

ఇండియా బైక్ వీక్ 2015: వెస్పా జిటిఎస్ 300 స్కూటర్ ప్రదర్శన

ఈ మల్టీమీడియా సిస్టమ్ స్పీడ్, ఆర్‌పిఎమ్, ఫ్యూయెల్ ఎకానమీతో పాటుగా పవర్, టార్క్, ఎయిర్ ప్రెజర్, టైర్ వేర్ డేటా మొదలైన సమాచారాన్ని కూడా చూపిస్తుంది.

ఇండియా బైక్ వీక్ 2015: వెస్పా జిటిఎస్ 300 స్కూటర్ ప్రదర్శన

ఈ మల్టీమీడియా సిస్టమ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను జిపిఎస్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. ముందు వైపు ఉండే యూఎస్‌బి పోర్ట్ సాయంతో ఫోన్‌ను చార్జ్ కూడా చేసుకోవచ్చు.

ఇండియా బైక్ వీక్ 2015: వెస్పా జిటిఎస్ 300 స్కూటర్ ప్రదర్శన

వెస్పా 946, ప్రమైవెరా, స్ప్రింట్ మోడళ్లలో కూడా పియాజ్జియో ఇలాంటి కొన్ని సేఫ్టీ మరియు కంఫర్ట్ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది.

ఇండియా బైక్ వీక్ 2015: వెస్పా జిటిఎస్ 300 స్కూటర్ ప్రదర్శన

వెస్పా జిటిఎస్ స్కూటర్ వెస్పా 946 స్కూటర్ కన్నా తక్కువ ధరను కలిగి ఉండటమే కాకుండా, మరింత శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Italian auto major Piaggio has displayed its powerful Vespa GTS 300 scooter at ongoing 2015 India Bike Week in Goa. Take a look.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X