భారత్‌కు ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన సైకిల్‌

By Ravi

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ ప్రీమియం సైకిళ్ల తయారీ సంస్థ గెయింట్ భారత మార్కెట్లోకి ప్రవేశించింది. బెంగుళూరులోని ఇందిరానగర్ వద్ద గెయిట్ బైస్కిల్స్ అండ్ బైక్ యాక్ససరీస్ షోరూమ్‌ను ప్రారంభించింది. స్టార్కెన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో చేతులు కలిపి గెయింట్ భారత్‌‌లో కార్యకలాపాలు సాగించనుంది. ఈ సంస్థ భారత్‌లో గెయింట్‌కు అధికారిక డీలర్, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించనుంది.

గెయింట్ ప్రారంభించిన ఈ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ 3200 చ.అ విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడి ఉంది. ఇందులో బైక్ సిముల్యేటర్లు, బైక్ స్పా, బైక్ ఫిట్, బైక్ లైబ్రరీ, బైక్ కెఫెలతో పాటుగా గెయింట్ రేంజ్ సైకిళ్లంటినీ ప్రదర్శనకు ఉంచనున్నారు. అంతేకాదు.. ప్రపంచంలో కెల్లా అత్యంత వేగవంతమైన సైకిల్‌గా పేరు తెచ్చుకొన్న ప్రొపెల్ అడ్వాన్స్డ్ ఎస్ఎల్ 0 మోడల్‌ను కూడా గెయింట్ ఇండియాలో విడుదల చేసింది.

India Gets Fastest Bicycle In The World By Giant

వరల్డ్స్ ఫాస్టెస్ట్ అడ్వాన్స్డ్ ఎస్ఎల్ 0 సైకిల్‌ను టీమ్ గెయింట్ షిమానో గతంలో జరిగిన టూర్ డి ఫ్రాన్స్ కార్యక్రమంలో ఉపయోగించింది. ఈ సైకిల్‌ను చాంపియన్ బైకర్ మార్సెల్ కిట్టెల్ నడిపి, మొత్తం ఎనిమిది రేసులకు గాను మూడు రేసులను గెలుచుకున్నాడు. ప్రపంచంలో కెల్లా అత్యంత క్లిష్టమైన రేసులో గెయింట్ షిమానో టీమ్ రెండు సార్లు నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది.

భారతదేశంలో ప్రీమియం సైకిళ్లకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోందని, వార్షికంగా చూసుకుంటే మొత్తం సైకిల్ మార్కెట్లో ప్రీమియం సైకిల్ మార్కెట్ వాటా 1 శాతానికి ఎగువన ఉందని స్టార్కెన్ స్పోర్ట్స్ ఎమ్‌డి, సీఈఓ ప్రవీణ్ వి పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన యూనియన్ బ్యాంక్ సిఎమ్‌డి అనీల్ తివారీ మాట్లాడుతూ.. బెంగుళూరు, పూనే, ఢిల్లీ మొదలైన మెట్రోపాలిటన్ నగరాల్లో సైక్లింగ్ ట్రెండ్ పెరుగుతోందని అన్నారు.

ఈ వీడియో చూశారా.. కెమెరాన్‌కు చావు తప్పి కన్ను లొట్ట పోయింది!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/YyE1Qh1enZQ?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Giant, a premium brand of bicycles and bike accessories has entered into Indiranagar, Bangalore. They have inaugurated its second experience centre with Starkenn Sports Pvt. Ltd., they are the only distributors and dealers for Giant in India.&#13;
Story first published: Friday, July 18, 2014, 16:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X