జెన్యూన్ ఇండియన్ యాక్ససరీస్‌తో ఇండియన్ బిగ్ చీఫ్ కస్టమ్

By Ravi

మరికొద్ది రోజుల్లో భారత మార్కెట్‌కు రానున్న అమెరికాకు చెందిన పురాతన మోటార్‌సైకిల్ కంపెనీ 'ఇండియన్ మోటార్‌సైకిల్స్' మరో అద్భుతమైన మోడల్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్ షోలో, 2014 ఛీఫ్ క్లాసిక్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని, ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిన ఓ మోటార్‌సైకిల్‌ను కంపెనీ ప్రదర్శనకు ఉంచింది.

ఇండియన్ మోటార్‌‌సైకిల్స్ ప్రదర్సించిన ఈ కొత్త కస్టమైజ్డ్ మోటార్‍‌సైకిల్‌కు 'ఇండియన్ బిగ్ ఛీఫ్ కస్టమ్' (Indian Big Chief Custom) అనే పేరును పెట్టారు. అయితే, నిరుత్సాహకర విషయం ఏంటంటే, ఇంత అద్భుతంగా కనిపించే ఈ మోటార్‌సైకిల్ ప్రొడక్షన్ వెర్షన్ కాకపోవటమే. అవును, ఇది కేవలం కాన్సెప్ట్ మాత్రమే. తమ కస్టమైజేషన్ సామర్థ్యాన్ని చాటేందుకు కంపెనీ ఈ బైక్‌ను తయారు చేసింది.


ఇండియన్ మోటార్‌సైకిల్స్‌కు చెందిన విడిభాగాల విభాగం 'జెన్యూన్ ఇండియన్ యాక్ససరీస్' ద్వారా ఆఫర్ చేయబడుతున్న కస్టమైజేషన్ సాధ్యాసాధ్యాలను ప్రదర్శించేందుకే ఈ 'ఇండియన్ బిగ్ ఛీఫ్ కస్టమ్'ను తయారు చేశారు. ఈ కస్టమైజ్డ్ మోటార్‌సైకిల్ తయారీలో పోలారిస్ ఇండస్ట్రియల్ డిజైన్ హెడ్ గ్రెగ్ బ్రూ యొక్క క్రియేటివ్ బ్రెయిన్ కూడా ఉంది.

ఈ కస్టమైజ్డ్ మోటార్‌సైకిల్‌ను ఇండియన్ మోటార్‌సైకిల్స్ బ్రాండ్ యొక్క తొలినాళ్లు గుర్తుకు వస్తాయి. వాస్తవానికి ఇది క్లాసిక్ డిజైన్ కలిగి ఉంటుంది. సింగిల్ స్ప్రింగ్ లింకేజ్ సిస్టమ్ కలిగిన బిల్లెట్ గిర్డర్ ఫ్రంట్ ఫోర్క్, కస్టమ్ వాలన్స్ ఫెండర్, స్ప్రింగ్ సీట్ ఇవన్నీ పురాన డిజైన్‌ను తలపిస్తాయి. 23 ఇంచ్ స్పోక్డ్ వీల్, కస్టమ్ బ్లాక్ అండ్ రెడ్ పెయింట్‌లు పురాతన తరం ఇండియన్ మోటార్‌సైకిల్స్ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసినవే.


ఇండియన్ మోటార్‌సైకిల్స్ ఆఫర్ చేసే ఉత్పత్తులు కొనుగోలు చేసే కస్టమర్లు ఎవరైనా, జెన్యూన్ ఇండియన్ యాక్ససరీస్ ఆఫర్ చేసే విడిభాగాలతో తమ మోటార్‌సైకిళ్లను తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చని తెలిపేందుకు కూడా కంపెనీ ఈ కొత్త ఇండియన్ బిగ్ ఛీఫ్ కస్టమ్‌ను తయారు చేసింది. ఈ బ్రాండ్ జనవరి 22, 2014న భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది.

ఇండియన్ మోటార్‌సైకిల్స్ జనవరి 22, 2014న తమ ఇండియన్ ఛీఫ్ క్లాసిక్, ఇండియన్ ఛీఫ్ వింటేజ్, ఇండియన్ ఛీఫ్టైన్ మోటార్‌సైకిళ్లను భారత్‌లో విడుదల చేయనుంది. ఈ మోడళ్లలో సరికొత్త థండర్‌స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగించారు. వాస్తవానికి ఈ మూడు మోటార్‌సైకిళ్లు ఒకే మాదిరిగా ఉంటాయి. కాకపోతే, వీటి పేరును బట్టి ఇందులో ఆఫర్ చేసే ఫీచర్లు వేర్వేరుగా ఉంటాయి.

Indian Motorcycles

ఈ మూడు మోడళ్లలో ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. అదే సరికొత్త థండర్ స్ట్రోక్ 111 క్యూబిక్ ఇంచ్ ఇంజన్. ఈ 1819సీసీ ఇంజన్ 161 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఒకప్పుడు ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మోటార్‌సైకిల్ కంపెనీ 'ఇండియన్ మోటార్‌సైకిల్స్'ను 1901లో స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఏటివి (ఆల్ టెర్రైన్ వెహికల్) తయారీదారైన, అమెరికాకు చెందిన పోలారిస్ ఇండస్ట్రీస్ 2011లో ఈ సంస్థను స్వాధీనం చేసుకుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Most Read Articles

English summary
Following its revival under Polaris Industries, with the launch of three new models, powered by the new Thunderstroke engine, Indian Motorcycles recently unveiled its first custom motorcycle based on a 2014 model model. Displayed for the first time at the New York City International Motorcycle Show, the custom model called the Indian Big Chief Custom is based on a 2014 Chief Classic.
Story first published: Tuesday, December 17, 2013, 10:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X