గుర్గావ్‌లో ఇండియన్ మోటార్‌సైకిల్స్ తొలి డీలర్‌షిప్ ప్రారంభం

By Ravi

ఇటీవలే భారత మార్కెట్లోకి ప్రవేశించిన అమెరికన్ ఐకానిక్ మోటార్‌‌సైకిల్ బ్రాండ్ 'ఇండియన్ మోటార్‌‌సైకిల్స్' (Indian Motorcycles) గుర్గావ్‌లో తమ తొలి డీలర్‌షిప్‌ను మే 7, 2014వ తేదీన ప్రారంభించింది. ఇండియన్ మోటార్‌సైకిల్స్ గడచిన జనవరి నెలలో భారత మార్కెట్లో తమ మూడు ఉత్పత్తులు - ఇండియన్ ఛీఫ్ క్లాసిక్, ఇండియన్ ఛీఫ్ వింటేజ్, ఇండియన్ ఛీఫ్టైన్ లనువిడుదల చేసిన విషయం తెలిసినదే.

గుర్గావ్‌లోని బి-10, ఇన్ఫోసిటీ, సెక్టార్-34 వద్ద ఇండియన్ మోటార్‌సైకిల్స్ తమ తొలి డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఈ షోరూమ్‌లో సేల్స్ అండ్ ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్ సేవలను అందించనున్నారు. ఈ షోరూమ్‌లో ఛీఫ్ క్లాసిక్, ఛీఫ్ వింటేజ్, ఛీఫ్టైన్ మోడళ్లను విక్రయించనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో మరో రెండు షోరూమ్‌లను ఏర్పాటు చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.


భారత మార్కెట్లో ఇండియన్ మోటార్‌సైకిల్స్ అందిస్తున్న మూడు ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి:
* ఇండియన్ ఛీఫ్ క్లాసిక్ - రూ.26.5 లక్షలు
* ఇండియన్ ఛీఫ్ వింటేజ్ - రూ.29.5 లక్షలు
* ఇండియన్ ఛీఫ్టైన్ - రూ.33.0 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)
Indian Motorcycles

వాస్తవానికి ఈ మూడు మోటార్‌సైకిళ్లు ఒకే మాదిరిగా ఉంటాయి. కాకపోతే, వీటి పేరును బట్టి ఇందులో ఆఫర్ చేసే ఫీచర్లు వేర్వేరుగా ఉంటాయి. ఫలితంగా వీటి ధరలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఈ మూడు మోడళ్లలో ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. అదే సరికొత్త థండర్ స్ట్రోక్ 111 ఇంజన్. ఈ 1819సీసీ ఇంజన్ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 161 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
Most Read Articles

English summary
On the 7th of May, 2014, Indian Motorcycles inaugurated its first dealership in Gurgaon, India. Polaris is the owner of the Indian Motorcycles subsidiary. The showroom is situated in the heart of the city at B-10, Infocity, Sector 34.
Story first published: Thursday, May 8, 2014, 16:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X