ఇండియా బైక్ వీక్ 2015: ఇండియన్ మోటార్‌సైకిల్స్

By Ravi

గడచిన సంవత్సరం భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఐకానిక్ అమెరికన్ టూవీలర్ కంపెనీ 'ఇండియన్ మోటార్‌సైకిల్' తాజాగా గోవాలోని బైక్ ప్రియులను అలరించింది. ఫిబ్రవరి 20, 21వ తేదీలలో గోవాలోని వగతోర్ ప్రాంతం వద్ద నిర్వహించిన భారతదేశపు అతిపెద్ద బైకర్ల పండుగ ఇండియా బైక్ వీక్ 2015లో ఇండియన్ మోటార్‌సైకిల్ తమ క్లాసిక్ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది.

దేశీయ విపణిలో ఇండియన్ అందిస్తున్న పాపులర్ మోడళ్లను కంపెనీ డిస్‌ప్లే చేసింది. అయితే, ఇండియన్ మోటార్‌సైకిల్ ఇటీవలే గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసిన డార్క్ హార్స్ మోటార్‌సైకిల్‌ను మాత్రం ఈ షోలో ప్రదర్శనకు ఉంచకపోవటం విచారకరం. మరి ఐబిడబ్ల్యూ 2015లో ఇండియన్ మోటార్‌సైకిల్ స్టాల్‌లో ఉంచిన మోడళ్లేంటో ఓ లుక్కేసొద్దాం రండి..!

ఇండియా బైక్ వీక్ 2015: ఇండియన్ మోటార్‌సైకిల్స్

తర్వాతి స్లైడ్‌లలో ఇండియా బైక్ వీక్ 2015లో ఇండియన్ మోటార్‌సైకిల్ ప్రదర్శనకు ఉంచిన మోడళ్లను చూడండి.

ఇండియన్ ఛీఫ్ క్లాసిక్

ఇండియన్ ఛీఫ్ క్లాసిక్

ఇండియన్ మోటార్‌సైకిల్ అందిస్తున్న ఛీఫ్ క్లాసిక్ మూడు రంగులలో (రెడ్, థండర్ బ్లాక్, థండర్ బ్లాక్ అండ్ రెడ్) లభిస్తుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.25.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఇండియన్ ఛీఫ్టైన్

ఇండియన్ ఛీఫ్టైన్

ఇండియన్ మోటార్‌సైకిల్ అందిస్తున్న ఛీఫ్టైన్ స్ప్రింగ్‌ఫీల్డ్ బ్లూ ఐవరీ క్రీమ్, ఇండియన్ రెడ్ థండర్ బ్లాక్, ఇండియన్ రెడ్ ఐవరీ క్రీమ్, థండర్ బ్లాక్ అండ్ ఇండియన్ రెండ్ రంగులలో లభిస్తుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.31.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఇండియన్ స్కౌట్

ఇండియన్ స్కౌట్

ఇండియన్ మోటార్‌సైకిల్ అందిస్తున్న స్కౌట్ నాలుగు రంగులలో (ఇండియన్ రెడ్, థండర్ బ్లాక్, థండర్ బ్లాక్ స్మోక్, సిల్వర్ స్మోక్) లభిస్తుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

ఇండియన్ ఛీఫ్ వింటేజ్

ఇండియన్ ఛీఫ్ వింటేజ్

ఇండియన్ మోటార్‌సైకిల్ అందిస్తున్న ఛీఫ్ వింటేజ్ ఐదు రంగులలో (విల్లో గ్రీన్ ఐవరీ క్రీమ్, ఇండియన్ రెడ్ ఐవరీ క్రీమ్, ఇండియన్ రెడ్ థండర్ బ్లాక్, ఇండియన్ రెడ్, ఇండియన్ థండర్ బ్లాక్) లభిస్తుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.28.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

థండర్‌స్ట్రోక్ 111 ఇంజన్

థండర్‌స్ట్రోక్ 111 ఇంజన్

ఇండియన్ మోటార్‌సైకిల్ తమ పాపులర్ 1811సీసీ ఇంజన్‌ను కూడా ఇండియా బైక్ వీక్ 2015లో ప్రదర్శనకు ఉంచింది. ఈ ఇంజన్ గరిష్టంగా 100 హెచ్‌పిల శక్తిని, 138.9 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇదొక ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్ కలిగిన ఎయిర్-కూల్డ్ ఇంజన్. కంపెనీ అందిస్తున్న ఛీఫ్ క్లాసిక్, ఛీఫ్ వింటేజ్, ఛీఫ్టైన్, రోడ్‌మాస్టర్, డార్క్ హార్స్ మోడళ్లలో ఈ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

Most Read Articles

English summary
The American two-wheeler manufacturer, Indian Motorcycles was present at 2015 India Bike Week. They showcased several of their motorcycles and here is their Chief Classic cruiser.
Story first published: Thursday, February 26, 2015, 10:26 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X