ఇండియన్ రోడ్‌మాస్టర్ విడుదల; ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

By Ravi

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం పోలారిస్‌కి చెందిన ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ తాజాగా భారత మార్కెట్లో మరో సరికొత్త మోడల్‌ను విడుదల చేసింది. 'ఇండియన్ రోడ్‌మాస్టర్' పేరిట కంపెనీ తమ లగ్జరీ టూరింగ్ మోటార్‌సైకిల్‌‌ను దేశీయ విపణిలో ప్రవేశపెట్టింది.

కొత్త 2015 ఇండియన్ రోడ్‌మాస్టర్ ప్యూర్ అమెరికన్ లగ్జరీని ప్రతిభింభింపజేస్తుందని, 1940 కాలంలో ఇండియన్ ఉపయోగించిన రోడ్‌మాస్టర్ పేరును తిరిగి మరోసారి తమ కొత్త 2015 మోడల్ కోసం ఉపయోగించామని కంపెనీ పేర్కొంది.

దూరప్రయాణాలకు అనువుగా కంఫర్ట్, స్టయిలింగ్, లగ్జరీ మరియు పెర్ఫార్మెన్స్‌ల కలబోతతో ఈ బైక్‌ను తయారు చేశారు. కొత్త 2015 ఇండియన్ రోడ్‌మాస్టర్ బైక్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఇండియన్ రోడ్‌మాస్టర్

పోలారిస్ ఇండియా ఆవిష్కరించిన ఈ సరికొత్త ఇండియన్ రోడ్‌మాస్టర్ ఓ క్రూజర్ స్టయిల్ మోటార్‌సైకిల్.

ఇంజన్ & ట్రాన్సిమిషన్:

ఇంజన్ & ట్రాన్సిమిషన్:

ఇండియన్ రోడ్‌మాస్టర్‌లో సరికొత్త థండర్ స్ట్రోక్ 111 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులోని 1819సీసీ ఇంజన్ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 161 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

హారిజాన్ పవర్ విండ్‌షీల్డ్

హారిజాన్ పవర్ విండ్‌షీల్డ్

ఇండియన్ రోడ్‌మాస్టర్ మోటార్‌సైకిల్ ముందు భాగంలో ఉన్న విండ్‌షీల్డ్‌ను మనకు నచ్చిన విధంగా సర్దుబాటు చేసుకోవచ్చు. పుష్-బటన్ సాయంతో ఎయిర్‌ఫ్లోని కస్టమైజ్ చేసుకొని, వెథర్ ప్రొటెక్షన్‌ని పొందటమే కాకుండా గ్లేర్‌ను కూడా తగ్గించుకోవచ్చు.

స్టోరేజ్ స్పేస్

స్టోరేజ్ స్పేస్

ఈ బైక్ వెనుక భాగంలో 140 లీటర్లో వాటర్‌ప్రూఫ్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. పిలియన్ రైడర్ బ్యాక్‌రెస్ట్‌కి అనుసంధానమై ఉండే ఈ స్టోరేజ్ స్పేస్‌లో మన టూరింగ్ అవసరమైన వస్తువులను దాచుకోవచ్చు. అలాగే, బైక్‌కి ఇరువైపులా రెండు శాడల్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. వీటన్నింటికి రిమోట్ లాక్/అన్‌లాక్ సౌకర్యం కూడా ఉంది.

హీటెడ్ సీట్స్

హీటెడ్ సీట్స్

ఇందులో జెన్యూన్ లెథర్ సీట్లను ఆఫర్ చేస్తున్నారు. శీతాకాలంలో చల్లగా ఉండే లెథర్ సీట్లను వేడిగా చేసేందుకు గాను ఇందులో హీటెడ్ సీట్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. హై, లో టెంపరేచర్ సెట్టింగ్స్ సాయంతో రైడర్, ప్యాసింజర్ సీట్లను వేడి చేసుకోవచ్చు.

హీటెడ్ గ్రిప్స్

హీటెడ్ గ్రిప్స్

సీట్లనే కాకుండా బైక్ హ్యాండిల్ గ్రిప్స్‌ను కూడా హీట్ చేసుకునే సౌలభ్యం ఇందులో ఉంది. పది సెట్టింగ్స్‌తో సరైన టెంపరేచర్ కోసం గ్రిప్స్ హీట్‌ని సర్దుబాటు చేసుకోవచ్చు.

అడ్జస్టబల్ ఫ్లోర్‌బోర్డ్స్

అడ్జస్టబల్ ఫ్లోర్‌బోర్డ్స్

ఇండియన్ రోడ్‌మాస్టర్ మోటార్‌సైకిల్‌లోని ఫ్లోర్‌బోర్డ్స్ (ఫుట్‌‌పెగ్స్/ఫుట్‌రెస్ట్స్)ను కూడా సర్దుబాటు చేసుకోవచ్చు. అల్టిమేట్ రైడింగ్ ఎక్స్‌పీరియెన్స్, లెగ్‌రూమ్ కంఫర్ట్ కోసం వీటిని మనకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకునే వెసలుబాటు ఉంది.

పాథ్‌ఫైండర్ ఎల్ఈడి లైట్స్

పాథ్‌ఫైండర్ ఎల్ఈడి లైట్స్

హెడ్‌లైట్, ఫాగ్ లైట్స్, టర్న్ సిగ్నల్స్, టెయిల్ లైట్ మరియు ఫ్రంట్ ఫెండర్ వార్ బానెట్‌పై ఉండే లైట్ కూడా అత్యంత ప్రకాశవంతంగా, రాత్రివేళల్లో రోడ్డుపై స్పష్టమైన కాంతిని అందించేలా ఇందులో ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు.

కీలెస్ ఇగ్నిషన్

కీలెస్ ఇగ్నిషన్

తాళం చెవి అవసరం లేకుండానే ఇండియన్ రోడ్‌మాస్టర్ మోటార్‌సైకిల్‌ను ఆన్ చేయవచ్చు. కార్లలో ఉండే కీలెస్ ఎంట్రీ ఫీచర్ మాదిరిగానే తాళం చెవిని జేబులో ఉంచుకొని, పుష్ బటన్ సాయంతో బైక్‌ను స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ తాళం చెవి పోయినా, మనం సెట్ చేసుకునే ఇండివిడ్యువల్ సెక్యూరిటీ కోడ్ సాయంతో ఇగ్నిషన్‌ను ఆన్ చేసుకోవచ్చు.

స్టీరియో సిస్టమ్

స్టీరియో సిస్టమ్

సంగీత ప్రియుల కోసం ఇండియన్ రోడ్‌మాస్టర్ మోటార్‌సైకిల్‌లో 200వాట్ స్టీరియో సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. బైక్‌పై జాలీ రైడ్ చేస్తూ, ఆహ్లాదకరమైన సంగీతాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఈ సిస్టమ్ ఏఎమ్/ఎఫ్ఎమ్/బ్లూటూత్/స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీలను సపోర్ట్ చేస్తుంది.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

ఇండియన్ రోడ్‌మాస్టర్ మోటార్‌సైకిల్‌లో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), టిపిఎమ్ఎస్ (టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్), క్రూయిజ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

కలర్ ఆప్షన్స్

కలర్ ఆప్షన్స్

ఇండియన్ రోడ్‌మాస్టర్ మోటార్‌సైకిల్‌లో మొత్తం మూడు రంగులలో లభిస్తుంది. అవి -

1. రెడ్

2. రెడ్ విత్ ఐవరీ క్రీమ్

3. థండర్ బ్లాక్

ధర

ధర

దేశీయ విపణిలో ఇండియన్ రోడ్‌మాస్టర్ మోటార్‌సైకిల్ ధర రూ.37 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Most Read Articles

English summary
Indian Motorcycles has launched its flagship model, the Indian Roadmaster. This motorcycle is a very good example where future technology meets true retro styling. The Indian Roadmaster is priced at INR 37 lakh (ex-showroom, Delhi). Deliveries will start by mid 2015.
Story first published: Tuesday, February 3, 2015, 15:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X