బైక్‌ల కోసం మూడేళ్ల ఇన్సూరెన్స్ పాలసీ

By Ravi

మోటారిస్టులకు ఓ గుడ్ న్యూస్. ఇకపై మీ బైక్ ఇన్సూరెన్స్‌ని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం బైక్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేసుకునే అవసరం లేకుండా ఏకంగా మూడేళ్లకు ఒకేసారి పాలసీని తీసుకునే వెసులుబాటుకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డిఏ గ్రీన్ సిగ్నల్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: కారు కోసం ఐదేళ్ల ఇన్సూరెన్స్ పాలసీ

మోటార్ వాహన చట్టం ప్రకారం, భారతదేశంలో ప్రతి మోటార్ వాహనం తప్పనిసరిగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ని కలిగి ఉండాలి. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ పాలసీ థర్డ్ పార్టీ లయబిలిటీని కవర్ చేస్తుంది. అయితే, అనేక మంది మోటార్‌సైకిల్ యూజర్లు సమయం లేకనో లేక మరచిపోయే లేక అవసరం లేదనుకునో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను క్రమంగా రెన్యువల్ చేసుకోరు.

IRDA Allows Three Year Covers For Bikes

ఈ నేపథ్యంలో, మోటార్ వాబన బీమా విషయంలో కూడా లాంగ్ టర్మ్ పాలసీలను ప్రవేశపెట్టాలని అనేక బీమా సంస్థలు పలు ప్రతిపాదలను ఐఆర్‌డిఏ ముందుచాయి. ఈ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించిన ఐఆర్‌డిఏ ముందుగా బైక్‌ల కోసం లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ విధానానికి శ్రీకారం చుట్టింది.

ఇది కూడా చదవండి: భారతదేశంలో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేందుకు చిట్కాలు

త్వరలోనే ఈ విధానం కార్లకు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం. వన్ టైమ్ విధానంగా ఐదేళ్ల పాటు కారుకు బీమా కవరేజ్ కల్పించేలా పాలసీలను ఆఫర్ చేయాలనే ప్రతిపాదనలను బీమా కంపెనీలు నియంత్రణ సంస్థ ముందుచాయి. అయితే, మూడేళ్ల పాటు ఇన్సూరెన్స్ తీసుకునే కస్టమర్లు ఒకేసారి మూడు రెట్లు ఎక్కువగా ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది (మూడు నెలల పాటు ప్రతి ఏటా చెల్లించే మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం). అయితే ఎట్టి పరిస్థితిల్లోను పాలసీ సమయంలో ప్రీమియం మొత్తాన్ని సవరించడానికి వీలుండదు.

Most Read Articles

English summary
Insurance Regulatory and Development Authority (IRDA) has devised a three-year version of the mandatory third-party liability cover for bikes and it has encouraged companies to come up with such long-term motor policies.
Story first published: Monday, August 18, 2014, 12:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X