జెడ్ఎక్స్10ఆర్, జెడ్ఎక్స్14ఆర్ బైక్‌లను విడుదల చేసిన కవాసకి

By Ravi

సెప్టెంబర్ నెలలో కవాసకి రెండు కొత్త బైక్‌లను విడుదల చేయనున్న తెలుగు డ్రైవ్‌‌స్పార్క్ గడచిన నెలలో ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. జపనీస్ బైక్ కంపెనీ కవాసకి, నేడు (సెప్టెంబర్ 4, 2013) భారత మార్కెట్లో రెండు సరికొత్త మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది.

స్పోర్ట్స్ బైక్ ప్రియులను లక్ష్యంగా చేసుకొని కవాసకి జెడ్ఎక్స్10ఆర్, కవాసకి జెడ్ఎక్స్14ఆర్ పేర్లతో ఈ బైక్‌లను దేశీయ విపణిలో విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ రెండు మోడళ్ల ధరలు ఇలా ఉన్నాయి.

  • కవాసకి జెడ్ఎక్స్10ఆర్ - రూ.15.7 లక్షలు
  • కవాసకి జెడ్ఎక్స్14ఆర్ - రూ.16.9 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, పూనే)
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

సెప్టెంబర్ 5, 2013 నుంచి బుకింగ్స్

సెప్టెంబర్ 5, 2013 నుంచి బుకింగ్స్

సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత్‌కు దిగుమతి చేసుకున్న ఈ రెండు బైక్‌లకు రేపటి నుంచి బుకింగ్‌లను ప్రారంభించనున్న కంపెనీ పేర్కొంది.

కవాసకి అవుట్‌లెట్స్

కవాసకి అవుట్‌లెట్స్

ఈ రెండు బైక్‌లను రెగ్యులర్ కెటిఎమ్ అవుట్‌లెట్లలో కాకుండా, ప్రత్యేకంగా ప్రారంభించనున్న కవాసకి అవుట్‌లెట్లలో విక్రయించనున్నారు. తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన కవాసకి బైక్‌లను మాత్రం యధావిధిగా కెటిఎమ్ అవుట్‌లెట్ల ద్వారానే విక్రయించనున్నారు.

కవాసకి జెడ్ఎక్స్10ఆర్

కవాసకి జెడ్ఎక్స్10ఆర్

ఈ బైక్‌‌లో శక్తివంతమైన 998సీసీ, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 194 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.8 సెకండ్లలోనే 0-100 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.

కవాసకి జెడ్ఎక్స్14ఆర్

కవాసకి జెడ్ఎక్స్14ఆర్

ఈ బైక్‌‌లో మరింత శక్తివంతమైన 1441సీసీ, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 210 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటాయి.

Most Read Articles

English summary
Japanese two-wheeler maker Kawasaki has just launched two super sports bikes ZX10R and ZX14R in India. These two bikes will be impotrted to India via the CBU route. Kawasaki Ninja ZX-10R is priced at Rs 15.7 lakh and ZX-14R is priced at Rs 16.9 lakh (both prices, ex-showroom, Pune).
Story first published: Wednesday, September 4, 2013, 13:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X