కవాసకి జెడ్800 విడుదల; ధర రూ.7.90 లక్షలు

By Ravi

కవాసకి జెడ్800 విడుదల గురించి తెలుగు డ్రైవ్‌‌స్పార్క్ గతంలో ప్రచురించినట్లుగానే, జపనీస్ బైక్ మేకర్ ఈ సరికొత్త స్పోర్ట్స్ బైక్‌ను సోమవారం దేశీయ విపణిలో విడుదల చేసింది. భారత మార్కెట్లో కవాసకి జెడ్800 బైక్ ధర రూ.7.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూనే)గా నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కవాసకికు భారత్‌లో ఇది 5వ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్)గా నిలువనుంది.

కవాసకి ఇటీవల విడుదల చేసిన జెడ్1000 బైక్‌కు దిగువన ఈ జె800 బైక్‌ను ప్రవేశపెట్టనున్నారు. కవాసకి జెడ్800 నేక్డ్ బైక్ కూడా చూడటానికి జెడ్1000 మాదిరిగానే అనిపిస్తుంది. ఈ రెండు బైక్‌ల స్టయిలింగ్ ఇంచు మించు ఒకేలా ఉంటుంది. అయితే, ఇంజన్ మాత్రం భిన్నంగా ఉంటుంది. కవాసకి జెడ్800 బైక్‌లో పేరుకు తగినట్లుగానే 806సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

కవాసకి జెడ్800 బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కవాసకి జెడ్800 విడుదల

కవాసకి జెడ్800 బైక్‌లో 806సీసీ లిక్విడ్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,200 ఆర్‌పిఎమ్ వద్ద 113 పిఎస్‌ల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 83 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

కవాసకి జెడ్800 విడుదల

భారత్‌లో కవాసకికు ఇది 5వ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మోడల్. సిబియూ రూపంలో ఇప్పటికే కంపెనీ నాలుగు (14ఆర్, 10ఆర్, జడ్1000, నిన్జా 1000) ఉత్పత్తులను విక్రయిస్తోంది. ప్రస్తుత సంవత్సరంలో ఈ ఐదు సిబియూ మోడళ్లను 400 యూనిట్లకు పైగా విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కవాసాకి మోటార్స్ డిప్యూటీ ఎండీ షిగెతో నిషికవ తెలిపారు.

కవాసకి జెడ్800 విడుదల

ఇదిలా ఉండగా, స్థానికంగా అసెంబుల్ చేస్తున్న సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) మోడళ్లయిన నిన్జా 300, నిన్జా 650 బైక్‌లను ఈ ఏడాది 1,400 యూనిట్ల వరకు విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన చెప్పారు.

కవాసకి జెడ్800 విడుదల

కవాసకి ప్రోడక్ట్ పోర్ట్‌‌ఫోలియోలో తాజాగా జెడి800 మోడల్‌తో వచ్చి చేరడంతో, భారత మార్కెట్లో ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఉత్పత్తుల సంఖ్య 7కు చేరుకుంది. గడచిన సంవత్సరంలో చివర్లో కావాసాకి జెడ్‌ 1000 మరియు నిన్జా 1000 బైక్‌లను కంపెనీ మార్కెట్‌లో విడుదల చేసింది. వీటి ధరలు రూ.12 లక్షలుగా ఉన్నాయి. అలాగే అంతకు ముందు సెప్టెంబర్ నెలలో నిన్జా జెడ్ఎక్స్-14ఆర్‌, జెడ్ఎక్స్-10ఆర్‌ బైక్‌లను కూడా విడుదల చేసిన విషయం తెలిసినదే.

కవాసకి జెడ్800 విడుదల

కొత్త మోడళ్ల విడుదలతో విస్తరిస్తున్న తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోకు అనుగుణంగానే, తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను కూడా విస్తరించుకునేందుకు సన్నాహాలు చేస్తున్నామని, 2015 నాటికి మొత్తం ఐదు డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేస్తామని షిగెతో నిషికవ చెప్పారు. ప్రస్తుతం కవాసకి మోటార్స్‌కు రెండు డీలర్‌షిప్ కేంద్రాలు (ఒకటి పూనేలో, మరొకటి ఢిల్లీలో) ఉన్నాయి.

Most Read Articles

English summary
Kawasaki has launched Z800 in India at INR 7.9 lakhs. Kawasaki Z800 is powered by a 806 cc liquid cooled, fuel injected, in-line four cylinder engine. The engine generates 113 PS power at 10,200 rpm and a peak torque of 83 Nm at 8,000 rpm and is mated to a 6 speed transmission.
Story first published: Tuesday, January 21, 2014, 7:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X