కవాసకి జెడ్800 ధరలో రూ.50,000 తగ్గింపు

By Ravi

జపాన్‌కి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి గడచిన జనవరి 2014 నెలలో మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త కవాసకి జెడ్800 నేక్డ్ స్ట్రీట్ బైక్ ధరను భారీగా తగ్గించింది. ఈ మోడల్‌పై కంపెనీ ఏకంగా రూ.50,000 తగ్గింపును ప్రకటించింది. థాయ్‌లాండ్ మార్కెట్లో ఈ మోడల్ ధరలు తగ్గిన నేపథ్యంలో, ఇండియాలో కూడా దీని ధరలను తగ్గించారు.

భారత్‌లో విక్రయిస్తున్న కవాసకి జెడ్800 మోడల్‌ను థాయ్‌లాండ్ మార్కెట్ నుంచి ఇండియాకు దిగుమతి చేసుకుంటున్నారు. కవాసకి జెడ్800 నేక్డ్ బైక్ కూడా చూడటానికి జెడ్1000 మాదిరిగానే అనిపిస్తుంది. ఈ రెండు బైక్‌ల స్టయిలింగ్ ఇంచు మించు ఒకేలా ఉంటుంది. అయితే, ఇంజన్ మాత్రం భిన్నంగా ఉంటుంది. కవాసకి జెడ్800 బైక్‌లో పేరుకు తగినట్లుగానే 806సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

 Kawasaki Z800 Prices Dropped By INR 50000

కవాసకి జెడ్800 బైక్‌లో 806సీసీ లిక్విడ్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,200 ఆర్‌పిఎమ్ వద్ద 113 పిఎస్‌ల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 83 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
Most Read Articles

English summary
The Kawasaki Z800 prices have been dropped by INR 50,000 by the Japanese manufacturer. The reason for the drop in prices is because prices have dropped in Thailand, where the motorcycle is being manufactured.
Story first published: Saturday, January 10, 2015, 10:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X