ఇండియాకు రానున్న కెటిఎమ్ 1050 అడ్వెంచర్ బైక్

By Ravi

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కెటిఎమ్, మరో పవర్‌ఫుల్ అడ్వెంచరస్ బైక్‌ను ఇండియాకు పరిచయం చేయనుంది. 1050సీసీ ఇంజన్ సామర్థ్యంతో కూడిన 'కెటిఎమ్ 1050' మోటార్‌సైకిల్‌ను కంపెనీ ఈ ఏడాది మిలాన్‌లో జరిగిన 2014 ఈఐసిఎమ్ఏ షోలో ప్రదర్శనకు ఉంచింది.

రోడ్-లీగల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ లైనప్‌లో కెటిఎమ్ ఆఫర్ చేస్తున్న స్మాలెస్ట్ ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ఇది. ఈ బైక్‌లో 1050సీసీ, లిక్విడ్ కూల్డ్, ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇదొక ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్.


ఇందులో వి-ట్విన్ 75 డిగ్రీల కోణంలో అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 95 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. టార్క్ వివరాలను కంపెనీ ఇంజా వెల్లడి చేయలేదు. దీని లైట్ వెయిట్ డిజైన్ కారణంగా, పెద్ద 1000సీసీ మోటార్‌సైకిళ్లతో పోల్చుకుంటే ఇది బెటర్ మైలేజీని ఆఫర్ చేయనుంది.

కెటిఎమ్ 1050 బైక్ రైడ్-బై-వైర్, మూడు రైడింగ్ మోడ్స్ (స్పోర్ట్, స్ట్రీట్, రెయిన్), ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్, బోష్ టూ-చానెల్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి ఫీచర్లతో లభిస్తుంది. ముందు వైపు నాన్ అడ్జస్టబల్, వెనుక వైపు అడ్జస్టబల్ ఫోర్క్స్ ఆఫర్ చేస్తున్నారు.

KTM 1050 Adventure

ఈ మోటార్‌సైకిల్ బరువు 212 కేజీలు. యూరప్ మార్కెట్లో దీని ధర సుమారు రూ.10 లక్షలు ఉండొచ్చని అంచనా. ఇండియన్ మార్కెట్లో ఇంచు మించు అదే ధర ఉండొచ్చని తెలుస్తోంది. త్వరలోనే ఈ కెటిఎమ్ 1050 బైక్ ఇండియాలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Most Read Articles

English summary
Austrian motorcycle manufacturer KTM, had showcased the India bound KTM 1050 Adventure at EICMA 2014, soon after the 1290 Super Adventure.
Story first published: Friday, November 21, 2014, 15:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X