కెటిఎమ్ డ్యూక్ 390 ఇప్పుడు బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్‌లో

By Ravi

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ గడచిన సంవత్సరం జూన్ 2013లో తమ డ్యూక్ 390 బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. అప్పటి నుండి ఇది కేవలం వైట్ అండ్ ఆరెంజ్ రంగులో మాత్రమే లభ్యమయ్యేది. కాగా.. తాజాగా కెటిఎమ్ ఇందులో బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. వాస్తవానికి ఈ కలర్ ఆప్షన్ గడచిన నవంబర్ నెలలో యూరప్ మార్కెట్లలో ప్రవేశపెట్టటం జరిగింది.

బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కెటిఎమ్ డ్యూక్ 390 కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించామని, దీని డెలివరీలు ఫిబ్రవరి నుంచి జరుగుతాయని కంపెనీ పేర్కొంది. దీని ధరలో, ఇంజన్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇది కూడా రెగ్యులర్ ధరకే (రూ.2.13 లక్షలు, ఎక్స్-షోరూమ్) లభ్యమవుతుంది. కెటిఎమ్ 390 డ్యూక్ బైక్‌లో 373.2సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 43.5 పిఎస్‌ల శక్తిని, 35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో జతచేయబడి ఉంటుంది.

KTM Duke 390 Now In Black Livery

ఏబిఎస్, మెట్‌జెలెర్ టైర్స్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, అల్యూమినియం అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో కెటిఎమ్ 390 డ్యూక్ బైక్‌ను తయారు చేశారు. దీని పవర్ టు రేషియో (పిటిడబ్ల్యూ) టన్నుకు 300 పిఎస్‌లు. ఈ పిటిడబ్ల్యూతో ఇది సాటిలేని పికప్‌ను, గరిష్ట వేగాన్ని ఆఫర్ చేస్తుంది. పవర్‌ఫుల్ ఇంజన్, లైట్ వెయిట్ మరియు ఈజీ హ్యాండ్లింగ్ ఫీచర్లతో కూడిన 390 డ్యూక్ ప్రొఫెషనల్ రైడర్లకు అలాగే స్పోర్టీ రైడ్ కోరుకునే వారికి చక్కగా సూట్ అవుతుంది.

భారతదేశంలోనే ఇది తొలి మిడ్-సైజ్ స్పోర్ట్స్ బైక్ కావటం విశేషం. భారతీయ రోడ్లకు అనుగుణంగా ఈ బైక్ సస్పెన్షన్‌ను ట్యూన్ చేశారు. ముందు వైపు 300 మి.మీ. డిస్క్ బ్రేక్, వెనుక వైపు 230 మి.మీ. డిస్క్ బ్రేక్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), 145 కిలోల బరువు, మెట్‌జెలెర్ స్పోర్టెక్ ఎమ్5 టైర్లు, స్పోర్టీ డిజైన్ వంటి ప్రధాన ఫీచర్లు కెటిఎమ్ 390 డ్యూక్ బైక్ సొంతం.

Most Read Articles

English summary
KTM Duke 390 was launched in June 2013 for India, however it was available in a white and orange guise. The black livery KTM Duke 390 was released for Europe in November 2013. Finally in India, bookings for the new paint scheme has commenced and deliveries will be done February onwards.
Story first published: Friday, January 24, 2014, 16:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X