టోక్యోలో కెటిఎమ్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ

By Ravi

స్పోర్ట్స్ బైక్‌లు, రేస్‌ బైక్‌లను తయారు చేసే కంపెనీ, ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేస్తే ఎలా ఉంటుంది..? ఇదిగో ఈ ఫోటోలలో కనిపిస్తున్న మాదిరిగానే ఉంటుంది. ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ బైక్‌ల తయారీ కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ డర్ట్ బైక్‌ను అభివృద్ధి చేసింది. పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండేలా జీరో ఎమిషన్‌తో కూడిన డర్ట్ బైక్‌ను తయారు చేయాలనే లక్ష్యంతో 'కెటిఎమ్ ఫ్రీరైడ్ ఈ' (KTM Freeride E) అనే కాన్సెప్ట్‌ను కెటిఎమ్ రూపొందించింది.

ఈ అధునాతన కెటిఎమ్ ఫ్రీరైడ్ ఈ ఎలక్ట్రిక్ బైక్‌తో పాటుగా 'కెటిఎమ్ ఈ-స్పీడ్' (KTM E-Speed) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా కంపెనీ తయారు చేసింది. కెటిఎమ్ ఈ రెండు కాన్సెప్ట్‌లను టోక్యో మోటార్‌సైకిల్ షోలో ఆవిష్కరించింది. ఫ్రీరైడ్ ఈ బైక్ మాదిరిగానే ఈ-స్పీడ్ స్కూటర్ కూడా ఎలాంటి పర్యావరణ, శబ్ధ కాలుష్యాలను కలిగించదు. భవిష్యత్తులో పట్టణ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని కెటిఎమ్ ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేసింది. ఇది చూడటానికి స్పోర్టీ టూవీలర్‌లా ఉంటుంది. వీటికి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫోటో ఫీచర్‌లో పరిశీలించండి.

కెటిఎమ్ ఫ్రీరైడ్ ఈ కాన్సెప్ట్

కెటిఎమ్ ఫ్రీరైడ్ ఈ కాన్సెప్ట్

కెటిఎమ్ జీరో ఎమిషన్ ఆఫ్‌రోడ్ స్పోర్ట్ మోటార్‌సైకిల్ ఫ్రీరైడ్ ఈ కాన్సెప్ట్, కంపెనీ యొక్క తొలి ఎలక్ట్రిక్ టూవీలర్. ఇందులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 29.5 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది.

కెటిఎమ్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్

కెటిఎమ్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్

కెటిఎమ్ అభివృద్ధి చేసిన రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్‌లో లిథియం అయాన్ బ్యాటరీల ద్వారా పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఈ బ్యాటరీ కేవలం 2 గంటలలోనే పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇందులో రీజరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అంటే బ్రేక్ వేసిన ప్రతిసారి ఉత్పత్తి శక్తితో ఈ బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి.

కెటిఎమ్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్

కెటిఎమ్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్

కెటిఎమ్ పేర్కొన్న సమాచారం ప్రకారం ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 11 కి.వా. శక్తిని, 36 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కెటిఎమ్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్

కెటిఎమ్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్

309 పౌండ్ల బరువు కిలిగిన కెటిఎమ్ ఈ-స్పీడ్ గరిష్టంగా గంటకు 85 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. బ్యాటరీ ఫుల్ చార్జ్‌పై 40 మైళ్ల దూరం ప్రయాణించవచ్చు.

కెటిఎమ్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్

కెటిఎమ్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్

హైబ్రిడ్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, డబ్ల్యూపి సస్పెన్షన్ ఎలిమెంట్స్, బరువును మోసే మరియు ఫ్రేమ్‌కు సపోర్టుగా నిలిచే అల్యూమినియం బ్యాటరీ కేసింగ్‌లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు.

Most Read Articles

English summary
If the KTM Freeride E was the Austrian motorcycle manufacturer's solution for an emission free dirt bike, then the E-Speed is the extension of the same idea towards urban mobility. The E-Speed electric scooter was unveiled by KTM at the Tokyo Motorcycle Show.
Story first published: Monday, March 25, 2013, 12:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X