సెప్టెంబర్ 9న కెటిఎమ్ ఆర్‌సి 200, ఆర్‌సి 390 విడుదల

By Ravi

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్, తమ ఆర్‌సి (RC) సిరీస్ బైక్‌లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ముహుర్తం ఖరారు చేసింది. వచ్చే నెల 9వ తేదీన కంపెనీ ఆర్‌సి 200, ఆర్‌సి 300 స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్లను విడుదల చేయనుంది. ప్రస్తుతం కెటిఎమ్ భారత మార్కెట్లో డ్యూక్ సిరీస్ క్రింద డ్యూక్ 200, డ్యూక్ 390 నేక్డ్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే.

కెటిఎమ్ డ్యూక్ 200, డ్యూక్ 390 నేక్డ్ మోటార్‌సైకిళ్లకు ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్లే ఈ ఆర్‌సి 200, ఆర్‌సి 390 మోటార్‌సైకిళ్లు. ఈ రెండు కొత్త మోడళ్లను డ్యూక్ సిరీస్ ప్లాట్‌ఫామ్‌లను ఆధారంగా చేసుకొనే తయారు చేస్తున్నారు. డ్యూక్ మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్లనే ఆర్‌సి బైక్‌లలోను ఉపయోగిస్తున్నాయి. అయితే, ఇంజన్ పెర్ఫార్మెన్స్‌ను మాత్రం రీట్యూన్ చేసే అవకాశం ఉంది.

KTM To Launch RC 200

డ్యూక్ బైక్‌లతో పోల్చుకుంటే ఆర్‌సి బైక్‌లు మరింత స్పోర్టీగా అనిపిస్తాయి. ఈ ఆర్‌సి సిరీస్ బైక్‌లలో ఫైనల్ డ్రైవ్ రేషియో మరియు ఈసియూ లలో మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ మార్పుల వలన ఆర్‌సి 200, ఆర్‌సి 390 బైక్‌లలోని ఇంజన్లు మరింత ఎక్కువ పవర్‌‌ను డెలివరీ చేయగలవు. సెప్టెంబర్ 9, 2014వ తేదీన పూనేలో ఈ రెండు మోడళ్లను విడుదల చేయనున్నారు. ఈమేరకు కంపెనీ మీడియా ప్రతినిధులకు ఆహ్వానాలు కూడా పంపింది.

కెటిఎమ్ ఆర్‌సి 200, ఆర్‌సి 390 బైక్‌లకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Austrian sports bike maker KTM will launch much awaited RC 200 and RC 390 in India on 9th September 2014.
Story first published: Thursday, August 28, 2014, 10:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X