మహీంద్రా సెంచురో బైక్‌ను దొంగిలించడం కష్టం!

మహీంద్రా టూవీలర్స్ అందిస్తున్న పాపులర్ 'మహీంద్రా సెంచురో' (Mahindra Centuro) మోటార్‌సైకిల్‌ను దొంగిలించడం అసాధ్యమని తేలిపోయింది. ఇంజన్ ఇమ్మొబిలైజర్ మరియు యాంటీ-థెఫ్ట్ అలారమ్ వంటి హైటెక్ సేఫ్టీ ఫీచర్లతో లభిస్తున్న ఈ బైక్‌ను ఓ దొంగ అపహరించడానికి విశ్వప్రయత్నం చేసి, అది వీలుకాకపోవటం రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయిన సంఘటన తాజాగా వెలుగు చూసింది.

నాగాలాండ్‌లోని డిమాపూర్‌కి చెందిన లోంగ్రీ ఐ. అయీర్ అనే వ్యక్తి ఇటీవల ఓ మహీంద్రా సెంచురో బైక్‌ను కొనుగోలు చేశాడు. అయితే, ఒకరోజు గుర్తు తెలియని దుండగుడు ఈ బైక్‌ను దొంగిలించేందుకు ప్రయత్నించాడు. ఒరిజినల్ తాళం లేకుండా బైక్‌ను స్టార్ట్ చేసేందుకు సదరు దొంగ విశ్వప్రయత్నాలు చేసినట్లు (ఇంజన్ వైర్లను కత్తిరించి స్టార్ట్ చేసినట్లు) తెలుస్తోంది.


ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బైక్ స్టార్ట్ కాకపోవటంతో చేసేది బైక్ నెంబర్ ప్లేట్‌ను అలాగే గోల్డెన్ రిబ్స్ (క్రాష్ గార్డ్)ను ఊడదీసుకొని బైక్‌ను రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు. లోంగ్రీ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో, పోలీసులు రోడ్డు పక్కన పడి ఉన్న బైక్‌ను గుర్తించి, సదరు బైక్ యజమానికి అప్పగించారు.

మహీంద్రా సెంచురో బైక్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

తన బైక్ తిరిగి వద్దకు రావటంతో లోంగ్రీ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. సాధారణంగా దొంగిలించబడిన బైక్‌లను వెతకటం చాలా కష్టమైన పని అని, దొంగతనాలను అరికట్టే యాంటీ-థెఫ్ట్ మెకానిజం కలిగిన మహీంద్రా బైక్‌ను కొన్నందకు తనకు చాలా సంతోషంగా ఉందని లోంగ్రీ చెప్పుకొచ్చాడు.

Mahindra Centuro

ఈ బైక్‌లో అంతర్జాతీయం పేటెంట్ పొందిన యాంటీ-థెఫ్ట్ అలారమ్ విత్ ఇంజన్ ఇమ్మొబిలైజర్ ఫీచర్‌ను జోడించటం వలన ఈ బైక్‌ను దొంగిలించడం అసాధ్యమైంది. ఇంజన్ ఇమ్మొబిలైజర్ అంటే (కార్లలో ఉండే ఇమ్మొబిలైజర్ మాదిరిగానే) ఒరిజినల్ కీ తప్ప వేరే కీతో బైక్‌ను స్టార్ట్ చేయాలని చూస్తే ఇంజన్ ఆన్ అవ్వదు. అంతేకాకుండా, అలా చేస్తే అలారమ్ మ్రోగి చుట్టు ప్రక్కల వారిని అప్రమత్తం చేస్తుంది.
Most Read Articles

English summary
Mahindra Centuro, one of the fastest selling motorcycles in India proved its mettle with one of its owner, Mr. Longri I. Aier, a resident of Dimapur, Nagaland in getting his vehicle back with the help of the Anti Theft facility of the bike. The Anti-Theft Alarm with Engine Immobilizer, an internationally patented feature on the Mahindra Centuro deterred a thief from starting the motorcycle while trying to steal it.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X