మహీంద్రా సెంచురో రాక్‌స్టార్ ఎడిషన్ విడుదల

By Ravi

మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న 110సీసీ మోటార్‌సైకిల్ 'సెంచురో' (Centuro)లో కంపెనీ మరో సరికొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. 'మహీంద్రా సెంచురో రాక్‌స్టార్' (Mahindra Centuro Rockstar) పేరిట కంపెనీ ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది.

దేశీయ విపణిలో మహీంద్రా సెంచురో రాక్‌స్టార్ ఎడిషన్ ధర రూ.43,684 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ కొత్త వేరియంట్ సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌లో లభిస్తుంది. ఇందులో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మినహా మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు. రెగ్యులర్ సెంచురో బైక్‌లో ఉపయోగించిన 106.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌నే ఇందులోను ఉపయోగించారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

మహీంద్రా సెంచురో రాక్‌స్టార్ ఎడిషన్

మహీంద్రా సెంచురో మోటార్‌సైకిల్‌కి సంబంధించిన మరింత సమాచారాన్ని తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

ఇంజన్ పెర్ఫార్మెన్స్

ఇంజన్ పెర్ఫార్మెన్స్

ఈ బైక్‌లో ఉపయోగించిన 106.7 సీసీ, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, ఎమ్‌సిఐ-5 (మైక్రో చిప్ ఇగ్నైటెడ్ 5-కర్వ్) ఇంజన్‌ 8.5 పిఎస్‌ల శక్తిని, 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

మైలేజ్

మైలేజ్

ఏఆర్ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) సర్టిఫై చేసిన దాని ప్రకారం, మహీంద్రా సెంచురో లీటర్ పెట్రోలుకు 85.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

రిమోట్ కీ ఆప్షన్

రిమోట్ కీ ఆప్షన్

మహీంద్రా సెంచురోలో అనేక ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నాయి. రిమోట్ కీ ఆప్షన్ ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ద్విచక్ర వాహనాల్లో రిమోట్ కీ ఆప్షన్‌తో లభ్యం కానున్న మొట్టమొదటి మోటార్‌సైకిల్ కూడా ఇదే.

ఫైండ్ మి ఆప్షన్

ఫైండ్ మి ఆప్షన్

ఈ రిమోట్ కీలో ఫైండ్ మి (Find Me) అనే ఆప్షన్ ఉంటుంది. పార్కింగ్ స్థలంలో మీ వాహనాన్ని సులువుగా గుర్తించేందుకు ఈ ఫైండ్ మి బటన్‌ను నొక్కినట్లయితే మీ బైక్ ఇండికేటర్లు ఆన్ అయ్యి, సులువుగా గుర్తు పట్టేందుకు సహకరిస్తుంది.

యాంటీ థెఫ్ట్ అలారమ్

యాంటీ థెఫ్ట్ అలారమ్

అంతేకాకుండా, ఈ స్మార్ట్ కీ మీ బైక్‌ను దొంగల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. ఇది 96-బిట్ సెక్యూర్ యాక్సెస్‌ను కలిగి ఉంటుంది, దీనిని డూప్లికేట్ చేయటం అసాధ్యం. నకిలీతో కీతో ఎవరైనా బైక్‌ను తస్కరించాలని ప్రయత్నిస్తే అలారమ్ మ్రోగుతుంది.

ఫ్లిప్ కీ

ఫ్లిప్ కీ

కార్ల మాదిరిగానే ఇది ఫ్లిప్ కీ (కీని రిమోట్‌లోకి వెనక్కు మడిచిపెట్టవచ్చు). ఈ రిమోట్ కంట్రోల్ పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌తో కూడుకుంది. ఇందులో ఎల్ఈడి టార్చ్, ఇమ్మొబిలైజర్ ఆప్షన్‌లు కూడా ఉన్నాయి.

ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్

ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్

ఇంకా ఇందులో సరికొత్త ఎల్ఈడి డిజిటల్ స్పీడో మీటర్, హెడ్‌లైట్‌కు పైభాగాన రెండు వైపులా జోడించిన ఎల్ఈడి ల్యాంప్స్ (పైలట్ ల్యాంప్స్), రియర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, సరికొత్త బాడీ డీజైన్ అండ్ గ్రాఫిక్స్ వంటి ఫీచర్లను గమనించవచ్చు.

గైడ్ మి ల్యాంప్స్

గైడ్ మి ల్యాంప్స్

చీకట్లో బైక్‌ను పార్క్ చేసిన తర్వాత, ఇంజన్ ఆఫ్ చేసినప్పటికీ హెడ్‌లైట్స్ అర నిమిషం పాటు ఆన్‌లో ఉండి రైడర్‌కు మార్గం చూపిస్తుంది.

డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

సాధారణంగా హై-ఎండ్ బైక్‌లలో కనిపించే ఈ తరహా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను సెంచురో బైక్‌లోను గమనించవచ్చు.

గోల్డెన్ రిబ్స్

గోల్డెన్ రిబ్స్

బైక్‌కు మరింత ప్రీమియం లుక్ కల్పించేలా సెంచురోలో ఫ్యూయెల్ ట్యాంక్‌కు క్రింది భాగంలో, ఫ్రంట్ స్క్రాచ్ గార్డ్‌కు పైభాగంలో గోల్డెన్ బార్‌ను అమర్చారు.

Most Read Articles

English summary
Mahindra has added a new Rockstar edition in its Centuro line-up. Mahindra has maintained their affordable nature of its Centuro motorcycle. The Indian manufacturer has priced its Centuro Rockstar edition at INR 43,684 ex-showroom, Delhi. The motorcycle now will attract a larger audience who prefer the smaller capacity engines.
Story first published: Tuesday, August 26, 2014, 9:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X