మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్..! నచ్చిందా..?

By Ravi

ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే తయారు చేసిన మహీంద్రా, ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా ఉత్పత్తి చేయనుంది. ఇదిగో ఈ ఫొటోల్లో మీరు చూస్తున్నది మహీంద్రా తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‌నే. దీని పేరు మహీంద్రా జెన్‌జీ (Mahindra GenZe).

ప్రత్యేకించి అమెరికన్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేశారు. ఈ ఏడాది మధ్య భాగం నాటికి ఇది అక్కడి మార్కెట్లలో విడుదల కానుంది. వాస్తవానికి గడచిన సెప్టెంబర్ నెలలో ఈ జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్ మహీంద్రా అమెరికాలో ఆవిష్కరించింది. దీనిని కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో అభివృద్ధి చేశారు.

పర్యావరణ సాన్నిహిత్య వాహనాలను ప్రోత్సహించే ప్రపంచ ప్రణాళికలో భాగంగా దీనని తయారు చేశారు. రోజువారీ ప్రయాణ అవసరాలకు అనువుగా ఉండేలా మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తేలికపాటి నిర్మాణం కలిగి ఉండేలా డిజైన్ చేశారు. భవిష్యత్తులో మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చైనా, ఇండియా దేశాల్లో కూడా ప్రవేశపెట్టనున్నారు. మరిన్ని వివరాలను ఈ ఫొటో పీచర్‌లో పరిశీలించండి.

మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్

మహీంద్రా జెన్‌జీ ఒక సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ సీట్ వెనుక భాగంలో ఓ పెద్ద బకెట్ లాంటి టబ్ ఉంటుంది. ఇందులో చిన్నపాటి లగేజ్‌ను భద్రపరచుకోవచ్చు.

మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ స్టోరేజ్ బకెట్‌లో సరుకుల సంచులు, మీడియం సైజ్ లగేజ్ బ్యాగ్‌లు మొదలైన వాటిని ఉంచుకోవచ్చు. రోజువారీ ప్రయాణ/రవాణా అవసరాలకు ఇది అనువుగా ఉంటుంది.

మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్

అంతేకాకుండా, ఈ స్కూటర్‌లో సీట్ క్రింది భాగంలో కూడా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇందులో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్ల వంటి గ్యాడ్జెట్లను భద్రపరుచుకోవచ్చు మరియు వాటిని యూఎస్‌బి పోర్ట్ సాయంతో రీచార్జ్ కూడా చేసుకోవచ్చు.

మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్

సాంప్రదాయ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్థానంలో 7-ఇంచ్ వాటర్‌ప్రూఫ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంటుంది. దీనిని బ్లూటూత్‌తో కనెక్ట్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. ఇది బ్యాటరీ స్టేటస్, మిగిలి ఉన్న బ్యాటరీ సామర్థ్యం వంటి పలు అంశాలను చూపిస్తుంది.

మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్

జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి మహీంద్రా ఎలాంటి సాంకేతిక వివరాలు వెల్లడించకపోయినప్పటికీ, ఇది లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది. ఇందులో 1.4 కి.వా. ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించనున్నారు. దీని గరిష్ట వేగం గంటకు 50 కి.మీ. దీని రేంజ్ ఇంకా తెలియరాలేదు.

మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్

మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 3000 డాలర్లు (సుమారు రూ.1,80,000) ఉండొచ్చని అంచనా.

మహీంద్రా జెన్‌జీ ఎలక్ట్రిక్ స్కూటర్

ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో విడుదలైతే సక్సెస్‌ను సాధిస్తుందా..?

Most Read Articles

English summary
Mahindra GenZe is an all-electric scooter which the company will launch in the United States by the middle of this year. First revealed in September in the States, the GenZe has been undergoing development in Palo Alto, California and is part of a global initiative to promote green vehicles.
Story first published: Wednesday, April 16, 2014, 15:50 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X