మహీంద్రా గస్టోలో మరో కొత్త వేరియంట్ విడుదల; ధర ఫీచర్లు

By Ravi

మహీంద్రా టూవీలర్స్, గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ లేటెస్ట్ 110సీసీ స్కూటర్ 'మహీంద్రా గస్టో' (Mahindra Gusto)లో కంపెనీ తాజాగా మరో కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. మహీంద్రా గస్టో స్కూటర్ ఇప్పటి వరకూ రెండు వేరియంట్లలో (బేస్ వేరియంట్ డిఎక్స్, టాప్ వేరియంట్ ఎస్ఎక్స్) మాత్రమే లభ్యమయ్యేది.

కాగా.. ఇప్పుడు ఈ రెండు వేరియంట్లకు మధ్యలో హెచ్ఎక్స్ అనే మిడ్-వేరియంట్‌ను మహీంద్రా విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ (హెచ్ఎక్స్) గస్టో స్కూటర్‌లో ఫైండ్-మి ల్యాంప్స్ మరియు ఫ్లిప్ కీ ఫీచర్లు ఉండవు, మిగిలిన అన్ని ఫీచర్లు ఉంటాయి. ప్రస్తుతం మహీంద్రా గస్టోలో లభిస్తున్న వేరియంట్లు, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

  • మహీంద్రా గస్టో డిఎక్స్ - రూ.44,800
  • మహీంద్రా గస్టో హెచ్ఎక్స్ - రూ.46,800
  • మహీంద్రా గస్టో విఎక్స్ - రూ.48,800

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఇది కూడా చదవండి: మహీంద్రా గస్టో టెస్ట్ రైడ్ రివ్యూ

Mahindra Gusto Hx Variant

మహీంద్రా గస్టో స్కూటర్‌ను అధునాతన ఇంజనీరింగ్ ఫీచర్లతో ఇటలీలో డిజైన్ చేయగా, పూనేలోని మహీంద్రా ఆర్ అండ్ డి కేంద్రలో దీనిని అభివృద్ధి చేశారు. ఈ స్కూటర్‌లో అధునాతన ఎమ్-టెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులోని 109.6సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.0 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

టాప్-ఎండ్ వేరియంట్ మహీంద్రా గస్టో స్కూటర్‌లో హైట్ అడ్జస్టబల్ సీట్, రిమోట్ ఫ్లిప్ కీ, ఫైండ్-మి ల్యాంప్స్, ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్‌‌తో కూడిన హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, క్విక్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు హైడ్రాలిక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లున్నాయి. ఇది మొత్తం ఆరు రంగులలో (ఐస్‌బర్గ్ వైట్, గలాక్టిక్ బ్లాక్, మాగ్నటిక్ మాగ్నెటా, వొల్కానో రెడ్, ఆర్కిటిక్ వైట్, రావెన్ బ్లాక్) లభిస్తుంది.

Most Read Articles

English summary
Mahindra Two Wheelers had launched its Gusto scooter in September, 2014. The Indian manufacturer is now adding a third trim level that will sit between these two models. The Gusto by Mahindra is their global offering and has been built by Indian engineers and designers.
Story first published: Friday, February 6, 2015, 12:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X