Just In
- 17 min ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్‌లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 1 hr ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 3 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 4 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్‌కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మహీంద్రా గస్టో స్కూటర్ విడుదల; ధర రూ.48,400
మహీంద్రా టూవీలర్స్, గడచిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో దేశీయ మార్కెట్లో విడుదల చేసిన మహీంద్రా గస్టో (Mahindra Gusto) ఆటోమేటిక్ స్కూటర్‌ను తాజాగా నేడు (జనవరి 7, 2015) కర్ణాటక మార్కెట్లో విడుదల చేసింది. మహీంద్రా గస్టో స్కూటర్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది, వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- మహీంద్రా గస్టో హెచ్ఎక్స్ - రూ.48,400
- మహీంద్రా గస్టో విఎక్స్ - రూ.50,400
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఎక్స్-షోరూమ్, బెంగుళూరు మరియు ప్రారంభోత్సవ ధరలు మాత్రమే (మొదటి 30 రోజులు)
ఇది కూడా చదవండి: మహీంద్రా గస్టో టెస్ట్ రైడ్ రివ్యూ
మహీంద్రా గస్టో స్కూటర్‌ను అధునాతన ఇంజనీరింగ్ ఫీచర్లతో ఇటలీలో డిజైన్ చేయగా, పూనేలోని మహీంద్రా ఆర్ అండ్ డి కేంద్రలో దీనిని అభివృద్ధి చేశారు.
ఇంజన్:
మహీంద్రా గస్టో స్కూటర్లో అధునాతన ఎమ్-టెక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులోని 109.6సీసీ, 4-స్ట్రోక్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.0 బిహెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.
కీలక ఫీచర్లు:
- హైట్ అడ్జస్టబల్ సీట్
- రిమోట్ ఫ్లిప్ కీ
- ఫైండ్-మి ల్యాంప్స్
- ఎల్ఈడి పైలట్ ల్యాంప్స్
- హ్యాలోజెన్ హెడ్‌ల్యాంప్స్
- క్విక్ స్టోరేజ్ కంపార్ట్మెంట్
- టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్
- హైడ్రాలిక్ రియర్ సస్పెన్షన్
కలర్ ఆప్షన్స్:
- ఐస్‌బర్గ్ వైట్
- గలాక్టిక్ బ్లాక్
- మాగ్నటిక్ మాగ్నెటా
- వొల్కానో రెడ్
- ఆర్కిటిక్ వైట్
- రావెన్ బ్లాక్
ఇప్పటి వరకూ పశ్చిమ, ఉత్తర భారతదేశ మార్కెట్లలో మాత్రమే లభిస్తున్న గస్టో స్కూటర్, ఇకపై దక్షిణ భారతదేశంలో కూడా లభ్యం కానుంది. మహీంద్రా గస్టో స్కూటర్ ఓ గ్లోబల్ స్కూటర్. ఇది కేవలం ఇండియన్ మార్కెట్లోనే కాకుండా సౌత్ ఏషియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల కానుంది.