ఆటో ఎక్స్‌పో 2014: మహీంద్రా మోజో బైక్ ఆవిష్కరణ

By Ravi

దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ ఈ 12వ ఎడిషన్ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోదగినది రీడిజైన్డ్ మహీంద్రా మోజో 300సీసీ బైక్.

గత కొద్ది సంవత్సరాలుగా మహీంద్రా మోజో బైక్ విడుదలను వాయిదా వేస్తూ వచ్చిన కంపెనీ, నేడు తమ సరికొత్త మోజో బైక్‌ను ఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. ఈసారి రెగ్యుల్ వెర్షన్ మోజో బైక్‌తో పాటుగా, దాని స్పోర్ట్ వెర్షన్‌ను కూడా కంపెనీ ఆవిష్కరింది.

మహీంద్రా మోజో ఈ ఏడాది జూన్ నెల నాటికి కానీ లేదా ఏడాది చివర్లో కానీ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోపుగా మహీంద్రా మోజో బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.

ఇంజన్

ఇంజన్

మహీంద్రా మోజో బైక్‌లో 295సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 28 బిహెచ్‌పిల శక్తిని, 25 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్పోర్ట్ వేరియంట్ కొంచ ఎక్కువ పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంది.

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

మహీంద్రా మోజో బైక్‌లో ఉపయోగించిన ఇంజన్6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

మహీంద్రా మోజో బైక్‌లో పెటల్ స్టైల్ డిస్క్ బ్రేక్స్, రేడియల్ టైర్స్, అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, పీరెల్లీ డెమోన్ టైర్స్ వంటి ఫీచర్లున్నాయి.

ఫీచర్లు

ఫీచర్లు

డిజిటల్ స్పీడోమీటర్, అనలాగ్ టాకోమీటర్ కాంబినేషన్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే, తమ సెంచురో బైక్‌లో ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్, కంఫర్ట్ ఫీచర్లను ఇందులోను ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయాన్ని కంపెనీ స్పష్టం చేయలేదు.

ప్రొడక్షన్ స్టేజ్

ప్రొడక్షన్ స్టేజ్

గతంలో కంపెనీ ఆవిష్కరించిన కాన్సెప్ట్ వెర్షన్ మహీంద్రా మోజో మాదిరిగా కాకుండా, కంపెనీ నేడు ఆవిష్కరించిన సరికొత్త రీడిజైన్డ్ మహీంద్రా మోజో ఉత్పత్తి దశకు చేరువగా ఉన్న మోడల్‌గా తెలుస్తోంది.

 
Most Read Articles
English summary
Mahindra Mojo in production guise has finally been revealed at the 2014 Auto Expo after it was first displayed way back in 2010. And what's more, Mahindra has not one, but two versions of the Mojo on display - the regular version and one in sports livery.
Please Wait while comments are loading...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X