బెంగుళూరు రోడ్లపై టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన మహీంద్రా మోజో

మహీంద్రా గ్రూపుకు చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూవీలర్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో సరికొత్త 300సీసీ బైక్ 'మహీంద్రా మోజో' (Mahindra Mojo)ను ప్రదర్శనకు ఉంచిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈ బైక్‌ను కంపెనీ భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఇటీవల ఈ బైక్‌లను బెంగుళూరు-టుంకూర్ రోడ్డుపై టెస్టింగ్ చేస్తుండగా మా డ్రైవ్‌స్పార్క్ కెమెరాకు చిక్కింది.

మహీంద్రా మోజో మొత్తం రెండు వేరియంట్లలో (రెగ్యులర్, స్పోర్ట్) లభ్యం కానున్నట్లు సమాచారం. మహీంద్రా మోజో బైక్‌లో 295సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 28 బిహెచ్‌పిల శక్తిని, 25 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్పోర్ట్ వేరియంట్ కొంచెం ఎక్కువ పెర్ఫామెన్స్‌ను కానీ లేదా ఇదే పెర్ఫామెన్స్‌ను కానీ ఆఫర్ చేసే అవకాశం ఉంది.

ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ బైక్‌లో పెటల్ స్టైల్ డిస్క్ బ్రేక్స్, రేడియల్ టైర్స్, అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, పీరెల్లీ డెమోన్ టైర్స్ వంటి ఫీచర్లున్నాయి. ఇంకా డిజిటల్ స్పీడోమీటర్, అనలాగ్ టాకోమీటర్ కాంబినేషన్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ బైక్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

ఈలోపుగా మహీంద్రా మోజో స్పై చిత్రాలను వీక్షించండి..!

Mahindra Mojo Testing
Mojo Auto Expo
Mojo Testing
Most Read Articles

English summary
The Mahindra Mojo launch has been delayed for a long time now, but the motorcycle has been spotted testing around the country multiple times. This could mean that Mahindra could launch the motorcycle anytime soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X