మహీంద్రా టూవీలర్స్ నుంచి 150సీసీ స్కూటర్

By Ravi

మహీంద్రా గ్రూపుకి చెందిన ద్విచక్ర వాహన విభాగం మహీంద్రా టూ వీలర్స్, ప్రతి ఆరు నెలలకు ఓ కొత్త మోడల్‌ను మార్కెట్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే, కంపెనీ ఈ ఏడాది తమ సరికొత్త 300సీసీ మోజో మోటార్‌సైకిల్‌తో పాటుగా ఓ కొత్త 150సీసీ స్కూటర్‌ను కూడా మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తోంది.

ప్రతి ఆరు నెలలకు కనీసం ఓ కొత్త మోడల్‌ను విడుదల చేస్తామని తాము గతంలోనే సూచించామని, తాము ఇందుకు కట్టుబడి ఉంటామని మహీంద్రా టూవీలర్స్ కస్టమర్‌కేర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మేంద్ర మిశ్రా తెలిపారు. పూనేలోని తమ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బృందం అనేక సెగ్మెంట్లను పరిగణలోకి తీసుకుంటుందని, ఇందులో ఓ 150సీసీ స్కూటర్ కూడా ఉందని ఆయన చెప్పారు.

Peugeot Motorcycle

హైదరాబాద్ మార్కెట్లో మహీంద్రా కొత్త 110సీసీ స్కూటర్ గస్టోని విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మార్కెట్లో మహీంద్రా గస్టో స్కూటర్ రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. రాష్ట్ర విపణిలో గస్టో హెచ్ఎక్స్ ధర రూ.48,100 లుగా ఉంటే, గస్టో విఎక్స్ ధర రూ.50,100 లుగా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, హైదరాబాద్).

ఇదిలా ఉండగా.. మహీంద్రా టూవీలర్స్ ఫ్రాన్స్‌కి చెందిన ప్యూజో కంపెనీలోని దిచక్ర వాహన యూనిట్‌లో వాటాల కొనుగోలు ప్రక్రియను ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. మహీంద్రా టూవీలర్స్ మొత్తం 54 బిలియన్ యూరోలు చెల్లించి, ప్యూజో మోటార్‌సైకిల్స్‌లో 51 శాతం వాటాలను కొనుగోలు చేయనుంది. వీరిద్దరి భాగస్వామ్యంతో భవిష్యత్తులో మరిన్ని మోడళ్లు మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Mahindra Two-wheelers had earlier indicated its plans to launch at least one new model every six months. Now its Pune based research and development team is considering several segments that includes a 150 cc scooter, company official said.
Story first published: Friday, January 9, 2015, 16:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X