సరికొత్త మోటార్‍‌సైకిళ్లను విడుదల చేయనున్న మహీంద్రా టూవీలర్స్

By Ravi

మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ద్విచక్ర వాహన విభాగం, మహీంద్రా టూవీలర్స్ ప్రస్తుత సంవత్సరంలో సరికొత్త శ్రేణి మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. మహీంద్రా టూవీలర్స్ ద్విచక్ర వాహన విభాగంలో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను శరవేగంగా విస్తరించుకుంటోంది. గడచిన మహీంద్రా అందిస్తున్న డ్యూరో, రోడియో స్కూటర్లలో అధునాతన జెడ్-సిరీస్ ఇంజన్లతో కూడిన అప్‌గ్రేడెడ్ వేరియంట్స్ డ్యూరో డిజెడ్, రోడియో ఆర్‌జెడ్ మోడళ్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే.

కంపెనీ ఇటీవలే ఆవిష్కరించిన సరికొత్త మోటార్‌సైకిళ్లు మహీంద్రా పాంటెరో, మహీంద్రా సెంచురో లను ఈ ఏడాదిలోనే వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. పూనేలో ఉన్న మహీంద్రా ఆర్ అండ్ డి ప్లాంటులో అభివృద్ధి చేసిన అధునాత టెక్నాలజీతో కూడిన ఇంజన్లను ఈ మోటార్‌సైకిళ్లలో ఉపయోగించనున్నారు. ఈ రెండు మోటార్‌సైకిళ్లను కంపెనీ ఇటీవలే మీడియాకు ప్రదర్శించిన విషయనం తెలిసినదే.

ఏప్రిల్ 2012 నుంచి మార్చ్ 2013 మధ్య కాలంలో మహీంద్రా టూవీలర్స్ మొత్తం 1,01,551 స్కూటర్లను విక్రయించింది. కేవలం గడచిన మార్చ్ నెలలోనే 5398 స్కూటర్లు అమ్ముడుపోయినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్త మోటార్‌సైకిళ్ల విడుదల పట్ల తామెంతో ఉత్సాహంగా ఉన్నామని, విశిష్టమైన మరియు ఆకర్షనీయమైన ఫీచర్లతో రూపొందించిన మహీంద్రా పాంటెరో, మహీంద్రా సెంచురో మోటార్‌సైకిళ్లు కొనుగోలుదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజీ అండ్ మార్కెట్ డెవలప్‌మెంట్) వీరెన్ పోప్లీ తెలిపారు.

Mahindra Pantero Centuro
Most Read Articles

English summary
Mahindra Two Wheelers Ltd. is rapidly expanding its portfolio. Last year, Mahindra launched the Duro DZ and Rodeo RZ range of scooters, with advanced Z-Series engine. This year will see the launch of their new motorcycle range - the Mahindra Pantero and the Mahindra Centuro. The entire range will come with advanced technology engines developed at the company’s state-of-art R&D Centre in Pune.
Story first published: Wednesday, April 3, 2013, 19:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X