త్వరలో భారత్‌లో మోటో గుజ్జి వి7 స్టోన్ విడుదల

By Ravi

ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం పియాజ్జియో గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2015 ఇండియా బైక్ వీక్‌లో ప్రదర్శనకు ఉంచిన మోటో గుజ్జి వి7 స్టోన్ మోటార్‌సైకిల్‌ను త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇదొక రెట్రో స్టైల్డ్ మోటార్‌సైకిల్.

భారత్‌లో హ్యార్లీ డేవిడ్‌సన్, ట్రైయంప్ వంటి మోటార్‌సైకిళ్ల విజయాన్ని చూసిన పియాజ్జియో, తాము కూడా లగ్జరీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో తమ సత్తా ఏంటో చాటుకోవాలని భావిస్తోంది. మోటో గుజ్జి వి7 స్టోన్ చూడటానికి కెఫే రేసర్ స్టయిల్ మోటార్‌సైకిల్ మాదిరిగా ఉంటుంది.

moto guzzi bike in india

మోటో గుజ్జి వి7 స్టోన్ బైక్‌లో 744సీసీ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 49 హెచ్‌పిల శక్తిని, 58 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

పియాజ్జియో ప్రస్తుతం మోటో గుజ్జి బ్రాండ్ క్రింద వి7 2 రేసర్, వి7 2 స్టోన్, వి7 2 స్పెషల్, కాలిఫోర్నియా టూరింగ్, కాలిఫోర్నియా కస్టమ్, నార్జ్ జిటి 8వి, స్టెల్వియో ఎన్‌టిఎక్స్ 1200 8వి, గ్రిసో 1200 8వి ఎస్ఈ, నెవడా, 1200 స్పోర్ట్ మోడళ్లను విక్రయిస్తోంది.

Most Read Articles

English summary
Piaggio was present at the 2015 edition of India Bike Week and it displayed motorcycles from Aprilia and Moto Guzzi, along with scooters from Vespa. Now the Italian manufacturer is contemplating a launch of its Moto Guzzi motorcycle. Moto Guzzi is planning on launching its V7 Stone for Indian market.
Story first published: Monday, March 2, 2015, 10:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X