కొత్త కరిజ్మా, కరిజ్మా జెడ్ఎమ్ఆర్ ధరలు వెల్లడి; బుకింగ్స్ ఓపెన్

By Ravi

హీరో మోటోకార్ప్ గతేడాది ఆవిష్కరించిన సరికొత్త కరిజ్మా మరియు కరిజ్మా జెడ్ఎమ్ఆర్ మోడళ్ల ధరలను కంపెనీ వెల్లడి చేసింది. ఈ రెండు మోడళ్ల కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించామని, మరికొద్ది రోజుల్లోనే ఇవి కస్టమర్ల వద్దకు చేరుకుంటాయని కంపెనీ పేర్కొంది. కరిజ్మా మోడళ్ల ఆన్-రోడ్ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

2014 హీరో కరిజ్మా ఆర్ - రూ.91,320 (ఢిల్లీ)
2014 హీరో కరిజ్మా ఆర్ - రూ.93,119 (ముంబై)

2014 హీరో కరిజ్మా జెడ్ఎమ్ఆర్ - రూ.1,14,210 (ఢిల్లీ)
2014 హీరో కరిజ్మా జెడ్ఎమ్ఆర్ - రూ.1,16,630 (ముంబై)


హీరో కరిజ్మా ఆర్ (బాడీ ప్యానెల్స్ లేని నేక్డ్ వెర్షన్) మరియు కరిజ్మా జెడ్ఎమ్ఆర్ (బాడీ ప్యానెల్స్ కలిగిన ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్)ల డిజైన్‌, ఇంజన్, ఫీచర్లను అంతర్జాతీయ సాంకేతిక భాగస్వాముల సహకారంతో కలిసి హీరో మోటోకార్ప్ అభివృద్ధి చేసింది.

ఈ రెండు బైక్‌లలోను కొత్త 223సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌నే ఉపయోగించారు. అయితే, కరిజ్మా ఆర్‌లో ఈ ఇంజన్ గరిష్టంగా 19 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కరిజ్మా జెడ్ఎమ్ఆర్‌లోని ఇంజన్ గరిష్టంగా 20 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండింటీ టార్క్ మాత్రం ఒకేలా (19.35 న్యూటన్ మీటర్లు) ఉంటుంది.

Karizma ZMR

పాత తరం కరిజ్మాలో ఉపయోగించిన 223సీసీ ఇంజన్ కేవలం 17.35 హార్స్‌పవర్‌ల శక్తిని, 18.35 న్యూటన్ మీటర్ల టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేసేది. అంటే, పాత కరిజ్మా ఇంజన్‌తో పోల్చుకుంటే ఈ కొత్త 2014 కరిజ్మాలోని ఇంజన్ మరింత అదనపు శక్తిని, టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను కలిగి ఉంటుందని అర్థం.

కరిజ్మా జెడ్ఎమ్ఆర్ ఫుల్ ఫెయిరింగ్‌తో పాటుగా ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో కూడా లభిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు గరిష్టంగా 135-140 కిలోమీటర్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది 3.6 సెకండ్ల వ్యవధిలో గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. కరిజ్మా ఆర్ మరియు జెడ్ఎమ్ఆర్ మోడళ్లు ఈ సెగ్మెంట్లో త్వరలో విడుదల కానున్న పల్సర్ 220 మరియు పల్సర్ 200ఎన్ఎస్ ఫెయిర్డ్ వెర్షన్లకు పోటీగా నిలిచే ఆస్కారం ఉంటుంది.

Most Read Articles

English summary
The all new Hero MotoCorp Karizma & Karizma ZMR, revealed first last year, will soon be seen on the streets. The prices of both the updated models are now out and dealerships in major cities have started accepting bookings.
Story first published: Monday, June 2, 2014, 22:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X