ప్యూజో ట్వీట్ ఇవో స్కూటర్ విడుదల

By Ravi

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం ప్యూజో (Peugeot) ఇప్పటి వరకు కార్లను మాత్రమే తయారు చేస్తుందని మనందరికీ తెలుసు. అయితే, ప్యూజో ఇప్పుడు ద్విచక్ర వాహనాల తయారీలోను తన సత్తా ఏంటో చూపించాలనుకుంది. అందుకే, అభివృద్ధి చెందుతున్న దేశాలం కోసం ప్యూజో ట్వీట్ ఇవో (Peugeot Tweet Evo) అనే ఓ సరికొత్త స్కూటర్‌‌‌ను కంపెనీ పరిచయం చేసింది.

వాస్తవానికి ప్యూజో సంస్థను 1810లో స్థాపించబడినప్పుడు, ఆ సంస్థ సైకిళ్లను, కాఫీ మిల్లులను తయారుచేసేది. ఆ తర్వాత 1882లో ఆర్మాండ్ ప్యూజో ద్వారా ఆటోమొబైల్ సెక్టార్ రంగంలోకి ప్రవేశించింది. స్కూటర్ ప్రియులను తొలిచూపులోనే ఆకట్టుకునేలా మోడ్రన్-రెట్రో లుక్‌ను కలిగి ఉండేలా ట్వీట్ ఇవో స్కూటర్‌‍‌ను డిజైన్ చేశారు.


కొత్త 2014 ప్యూజో ట్వీట్ ఇవో స్కూటర్ అంటార్కిటిక్ వైట్, ఆంక్సీ గ్రే, బ్లూబెర్రీ కలర్లలో లభ్యం కానుంది. కస్టమర్ల ఎంపిక మేరకు సీట్ ఆప్షన్స్ ఉంటాయి. వైట్ కలర్ స్కూటర్‌లో బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్‌ని ఆఫర్ చేస్తున్నారు. గ్రే మరియు బ్లూబెర్రీ కలర్ స్కూటర్లలో మాత్రం సిల్వర్ కలర్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు.

ప్యూజో ట్వీట్ ఇవో స్కూటర్ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒకటి 50సీసీ ఫోర్-స్ట్రోక్ ఇంజన్ కాగా మరొకటి 125సీసీ ఫోర్-స్ట్రోక్ ఇంజన్. మన కరెన్సీలో 50సీసీ వెర్షన్ ధర రూ.1.81 లక్షలుగా ఉండే, 125సీసీ వెర్షన్ ధర రూ.2.11 లక్షలుగా ఉంది. ప్రస్తుతానికి ఇది గ్లోబల్ మార్కెట్లలో మాత్రమే లభ్యమవుతోంది.

Peugeot Tweet Evo

ఇండియాలో దీనిని విడుదల చేసే అంశం గురించి కంపెనీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, ప్యూజో ఇండియాలోకి ప్రవేశించిన కార్ల తయారీ కోసం ఓ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ప్యూజో ద్విచక్ర వాహనాలు కూడా ఇండియాలో విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
Most Read Articles

English summary
French manufacturer Peugeot is known for its four wheelers but did you know they offer scooters in developed countries? The Peugeot company was founded in 1810 and back then, they manufactured bicycles and coffee mills. The automobile sector was established in 1882 by Armand Peugeot.
Story first published: Saturday, June 14, 2014, 16:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X