ఫ్లై 125సీసీ స్కూటర్‌ను భారత్‌లో విడుదల చేయనున్న పియాజ్జియో

By Ravi

వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్‌తో భారత ద్విచక్ర వాహన మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఇటాలియన్ కంపెనీ పియాజ్జియో, ఇప్పుడు మరో కొత్త స్కూటర్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో పియాజ్జియో అందిస్తున్న ఫ్లై 125సీసీ స్కూటర్‌ను కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టనుంది.

నిజానికి, పియాజ్జియో ఇప్పటికే ఓ ఫ్లై 125 మోడల్‌ను రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం భారత్‌కు దిగుమతి చేసుకుంది. బహుశా ఈ మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడంపై కంపెనీ అధ్యయనం చేయడానికి లేదా ఈ మోడల్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసి, పొరుగు దేశాలకు ఎగుమతి చేయడానికే ఫ్లై స్కూటర్‌ను ఇండియాకు దిగుమతి చేసుకున్నట్లు సమాచారం.

piaggio fly india launch

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే పియాజ్జియో ఫ్లై స్కూటర్‌లో కూడా ఉపయోగించనున్నట్లు సమాచారం. పియాజ్జియో ఫ్లై 125సీసీ స్కూటర్‌లో ఉపయోగించిన 125సీసీ ఇంజన్ 10 బిహెచ్‌పిల శక్తిని, 10.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

మెరుగైన మైలేజ్‌ను ఆఫర్ చేసేందుకు గాను పియాజ్జియో ఫ్లై స్కూటర్‌లో, వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్‌లో ఉపయోగింటిన 3-వాల్వ్ టెక్నాలజీని కాకుండా ఉపయోగించగా, 2-వాల్వ్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని తెలుస్తోంది. టెలిస్కోపిక్ ఫోర్క్, హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్స్, డ్రమ్ బ్రేక్స్, ముందు వైపు ఆప్షనల్ డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లతో ఇది లభ్యం కానుంది.

Most Read Articles

English summary
Piaggio has now imported their Fly 125 scooter to India for R&D purpose. There are only two explanations for this move, either the manufacturer is launching the scooter in India or plan to manufacture it here and export it to certain markets.
Story first published: Saturday, January 31, 2015, 11:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X