సెప్టెంబర్‌లో వెస్పా ఎలిగాంట్ స్కూటర్ విడుదల

By Ravi

ఇటాలియన్ స్కూటర్ వెస్పాపై మనసు పారేసుకోని వారెవరూ ఉండరేమో. పియాజ్జియో తమ వెస్పా స్కూటర్లకు క్లాసిక్ లుక్‌తో పాటుగా మోడ్రన్ టచ్‌ను జోడించి అద్భుతమైన, అందమైన స్కూటర్లను తయారు చేస్తుంది. ఒకప్పుడు భారత్‌లో అత్యంత సుపరిచితమైన వెస్పా బ్రాండ్ ఆ తర్వాత 2012లో తమ ఎల్ఎక్స్125 స్కూటర్‌తో ఇండియన్ మార్కెట్లోకి పునఃప్రవేశించి, భారతీయుల మది దోచుకుంది.

ఇది కూడా చదవండి: ఆగస్టులో టీవీఎస్ జెస్ట్ స్కూటర్ విడుదల

ప్రస్తుతం పియాజ్జియో భారత విపణిలో వెస్పా ఎల్క్125, వెస్పా విఎక్స్125 మరియు వెస్పా ఎస్ అనే మూడు స్కూటర్లను విక్రయిస్తోంది. కంపెనీ ఇటీవలే వెస్పా ఎస్‌క్లూజివో అనే లిమిటెడ్ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది. కాగా.. మరో కొత్త స్కూటర్‌ను భారత్‌కు పరిచయం చేసేందుకు పియాజ్జియో, వెస్పాలు సిద్ధమవుతున్నాయి. భారత్‌లో 4వ స్కూటర్‌గా రానున్న మోడల్ పేరు 'ఎలిగాంట్' (Elegante).

Piaggio Vespa To Launch Elegante In September

ఇతర వెస్పా స్కూటర్ల మాదిరిగానే వెస్పా ఎలిగాంట్ కూడా క్లాసిక్ డిజైన్‌తో పాటుగా మోడ్రన్ టెక్నాలజీలను కలిగి ఉండనుంది. ఇందులో కూడా ఇది ప్రస్తుత 125సీసీ ఇంజన్‌నే ఉపయోగించనున్నట్లు సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 9.91 హార్స్ పవర్‌ల శక్తిని, 10.6 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కంటిన్యూస్ వేరియబల్ ట్రాన్సిమిషన్ (సివిటి) గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

ఇది కూడా చదవండి: యమహా నుంచి ఓ సరికొత్త 125సీసీ స్కూటర్

వెస్పా అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న ఉత్పత్తుల నుంచి స్ఫూర్తి పొంది ఎలింగాంట్‌ను డిజైన్ చేసే అవకాశం ఉంది. ఇందులో విశిష్టమైన ట్రయాంగ్యులర్ హెడ్‌లైట్ ఉంటుంది. ప్రీమియం టచ్ కోసం ఇందులో ఎక్కువ క్రోమ్ గార్నిష్ చేయనున్నారు. ఇందులో డిస్క్ బ్రేక్స్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభించే అవకాశం ఉంది. బెటర్ రోడ్ గ్రిప్ కోసం మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్స్ ఉంటాయి. ఇది బ్లూ, వైట్, యెల్లో కలర్ ఆప్షన్లలో లభ్యం కావచ్చని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

ఈ వీడియో చూశారా..?
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Y7n3X2h_N3k" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Piaggio and Vespa plan to launch their fourth product in India and is being dubbed as the Elegante. Presuming from the scooters name, we believe it will be more stylish. It is expected to sport a classic and elegant design with all the modern technologies to make it smooth and easy.&#13;
Story first published: Wednesday, August 6, 2014, 10:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X