టెస్టింగ్ దశలో కెమెరాకు చిక్కిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్

By Ravi

బుల్లెట్ బైక్‌లను తయారు చేయటంలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సంపాధించుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు యువత కోసం ఓ సరికొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురానుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కెపే రేసర్ 535 మోటార్‌సైకిల్ గురించి మనం ఇప్పటికే పలు కథనాల్లో చర్చించుకోవటం జరిగింది.

తాజాగా ఈ కెఫే రేసర్‌ టెస్టింగ్ దశలో ఉండగా కెమెరాకు చిక్కింది. లేటెస్ట్ చిత్రాలను బట్టి చూస్తుంటే ఈ బైక్ టెస్టింగ్ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది వాణిజ్య పరంగా అందుబాటులోకి రావచ్చని అంచనా.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలిసారి ఈ కెఫే రేసర్ 535 మోటార్‌సైకిల్‌ను న్యూఢిల్లీలో జరిగిన 2012 అంతర్జాతీయ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఆ తర్వాత మిలాన్‌లో జరిగిన ఈఐసిఎమ్ఏ ఆటో షోలో కూడా ప్రొడక్షన్ రెడీ కెఫే రేసర్ 535 మోటార్‌సైకిల్‌ను కంపెనీ ప్రదర్శించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ కెఫే రేసర్ 535 బైక్‌ను తాము అందిస్తున్న ఇతర మోటార్‌సైకిళ్ల పూర్తి విభిన్నంగా తీర్చిదిద్దింది. తక్కువ దూరాలు ప్రయాణించే వారి కోసం, ప్రత్యేకించే వేగం అంటే ఇష్టపడే యువత కోసం, విశిష్టమైన లుక్ కలిగి బైక్‌ను కోరుకునే వారి కోసం ఈ బైక్‌ను తయారు చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535

రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535


ఇందులో శక్తివంతమైన 535సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది తేలిక బరువును కలిగి ఉండి ఎక్కువ వేగంతో పరుగులు తీస్తుంది. ఆకర్షనీయమైన డిజైన్, క్లాసిక్ స్పోక్ వీల్స్, ముందు మరియు వెనుక చక్రాలకు అమర్చిన డిస్క్ బ్రేక్, స్ప్లిట్ హ్యాండిల్ బార్‌లు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

అలాగే, హ్యాండిల్‌ బార్‌ చివర్లో అమర్చిన సైడ్ వ్యూ మిర్రర్స్, మెరుగైన సస్పెన్షన్, డిజిటల్ అనలాగ్ కాంబినేషన్‌తో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ కెఫే రేసర్ 535 మోటార్‌సైకిల్ సొంతం. దేశీయ విపణిలో దీని ధర రూ.2 లక్షల రేంజ్‍‌లో ఉండొచ్చని అంచనా.

Most Read Articles

English summary
As we reported earlier about Royal Enfield Cafe Racer launch, now this bike has spotted while testing in Indian roads.2013. The Royal Enfield Cafe Racer, according to the report, will be powered by a 535cc UCE engine. The new bike will be the company's top of the line model offering more horsepower and torque compared to its existing line up.
Story first published: Thursday, April 4, 2013, 13:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X