16 ఏళ్లు నిండిన స్కూలు పిల్లలకి టూవీలర్ లైసెన్స్!

ఏంటీ 16 ఏళ్లు నిండిన పిల్లలకే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తారా..? అలా అయితే ప్రమాదాలు మరింత పెరిగే ఆస్కారం ఉందంటారా..! కంగారుపడకండి, ఈ డ్రైవింగ్ లైసెన్స్ రెగ్యులర్ 2-వీలర్/4-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ లాంటిది కాదు. ఇది కేవలం నాన్-గేర్ (గేర్లు లేని) స్కూటర్ల (ఆటోమేటిక్ స్కూటర్ల)ను నడిపేందుకు మాత్రమే పనికొస్తుంది. వివరాల్లోకి వెళితే...

స్కూలు ప్రతినిధులు మరియు ట్రాఫిక్ అధికారుల సమక్షంలో ఇండోర్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక కాన్ఫరెన్స్‌లో ట్రాఫిక్ పోలీస్ విభాగం, 16 ఏళ్లు పైబడిన స్కూలు విద్యార్థులకు ఓ ప్రత్యేక నాన్-గేర్ టూవీలర్ లైసెన్స్ మంజూరు చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది.


ఈ ప్రత్యేక లైసెన్స్‌ను ఆర్టీఓ మరియు స్కూలు అడ్మినిస్ట్రేషన్‌ల మధ్య కుదుర్చుకునే ఓ ప్రత్యేక ఒప్పందాన్ని అనుసరించి జారీ చేయనున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల ప్రయాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని నిర్వహించిన ఓ సెమినార్‌లో ఈ ప్రతిపాదనకు ఆజ్యం పోశారు. ఆటోమేటిక్ టూవీలర్ లైసెన్స్ జారీతో పాటుగా స్కూలు పిల్లలకు సంబంధించిన భద్రత విషయంలో మరో మూడు ఇతర ముఖ్యమైన అంశాలను కూడా ప్రస్తావించారు.

ఇందులో మొదటిది స్కూలు పిల్లలను పాఠశాలలకు తరలించేటప్పుడు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఆటో డ్రైవర్లు భద్రతా మార్గదర్శకాల పట్ల అవగాహన కలిగి ఉండటం.

రెండవది, స్కూలుకు పిల్లలను తీసుకువచ్చే వాహనాలు (ప్రైవేట్ వాహనాలతో కలిపి), డ్రైవర్లు తదితర వివరాలకు సంబంధించి పాఠశాల యాజమాన్యం సరైన వివరాలు/రికార్డులు కలిగి ఉండటం మరియు లైసెన్స్ లేని పిల్లలను స్కూలుకు ద్విచక్ర వాహనాలపై రావటాన్ని అనుమతించకపోవటం.

Scooter

ఇకపోతే మూడవది, పాఠశాలల్లో ట్రాఫిక్ సేఫ్టీ కమిటీలను స్థాపించి, విద్యార్థుల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించేలా ఏడాది పాటు పలు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించటం.

ఇండోర్‌లో దాదాపు 40 పాఠశాలలకు చెందిన ప్రతినిధులు ఈ సెమినార్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి సంజయ్ గోయల్, ఆర్టీఓ జితేంద్ర రఘవంశి మరియు డిఎస్‌పి ట్రాఫిక్ విక్రమ్ రఘవంశి తదితరులు హాజరయ్యారు.

Most Read Articles

English summary
The traffic police department, during a special conference held in Indoor, attended by school representatives, has put forth a suggestion relating to issuing special non-gear two-wheeler licence to school students aged above 16 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X