సుజుకి జిక్సర్ బుకింగ్స్ ఓపెన్; జులై 2014లో విడుదల!

By Ravi

జపనీస్ టూవీలర్ బ్రాంట్ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచిన తమ సరికొత్త 150సీసీ బైక్ 'సుజుకి జిక్సర్' (Suzuki Gixxer)ను జులై నాటికి మార్కెట్లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే సుజుకి మోటార్‌సైకిల్ డీలర్లు కొత్త జిక్సర్ బైక్ కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించారు. సుజుకి తమ జిక్సర్ బైక్‌ను ప్రత్యేకించి నేటి యువతను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేసింది.

సుజుకి జిక్సర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఉపయోగించారు.. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న 'హోండా ఈకో టెక్నాలజీ' (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది. ఈ టెక్నాలజీ వలన ఇంజన్ మెకానికల్ లాసెస్ తగ్గి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌లు పెరగటంతో పాటు మెరుగైన మైలేజీని కూడా పొందవచ్చు. సుజుకి జిక్సర్ 150సీసీ బైక్ సెగ్మెంట్లో హీరో హంక్, హోండా సిబి ట్రిగ్గర్, బజాజ్ పల్సర్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

సుజుకి జిక్సర్ బుకింగ్స్ ఓపెన్

సుజుకి అందిస్తున్న జిఎస్ఎక్స్-ఆర్ 1000సీసీ బైక్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త సుజుకి జిక్సర్‌ను డిజైన్ చేశారు. సుజుకి జిక్సర్ బైక్‌కు సంబంధించి కొన్ని టెక్నికల్ డిటేల్స్‌ను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

సుజుకి జిక్సర్ బుకింగ్స్ ఓపెన్

సుజుకి జిక్సర్ డిజైన్‌ను గమనిస్తే, దీని హెడ్‌‌లైట్ నుంచి టెయిల్ లైట్ వరకు ప్రతి డిజైన్ ఎలిమెంట్ కూడా ఎంతో స్టయిలిష్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది.

సుజుకి జిక్సర్ బుకింగ్స్ ఓపెన్

సుజుకి జిక్సర్‌లో 155సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి (సింగిల్ ఓవర్ హెడ్ కామ్‌షాఫ్ట్) పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 13.9 పిఎస్‌ల శక్తిని, 19.4 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్, కిక్ స్టార్ట్ ఆప్షన్స్ రెండూ ఉంటాయి.

సుజుకి జిక్సర్ బుకింగ్స్ ఓపెన్

సుజుకి జిక్సర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీనిచ్చేందుకు సహకరిస్తుంది.

సుజుకి జిక్సర్ బుకింగ్స్ ఓపెన్

సుజుకి జిక్సర్‌లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను వెనుక వైపు మోనోషాక్, స్వింగ్ఆర్మ్ టైప్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు. సుజుకి జిక్సర్‌లో ముందువైపు డిస్క్ బ్రేక్స్‌ను వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

సుజుకి జిక్సర్ బుకింగ్స్ ఓపెన్

సుజుకి జిక్సర్ కాస్ట్ అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. దీని ఫ్రంట్ టైర్ సైజ్ 100/80-17, వెనుక టైరు సైజ్ 140/60-17. సుజుకి జిక్సర్ ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది.

సుజుకి జిక్సర్ బుకింగ్స్ ఓపెన్

దేశీయ విపణిలో సుజుకి జిక్సర్ ధర సుమారు రూ.75,000 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. జులై 2014 నుంచి సుజుకి జిక్సర్ అమ్మకాలు వాణిజ్యం పరంగా ప్రారంభం అవుతాయి.

Most Read Articles

English summary
Unveiled right before the Auto Expo in February, along with the Let's scooter, Suzuki Gixxer 150's launch nears. The bike was expected to hit the roads in July and it looks like it Suzuki will stick to its launch schedule.
Story first published: Thursday, June 12, 2014, 12:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X