సుజుకి జిక్సర్ 150సీసీ బైక్ విడుదల; ధర రూ.72,199

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, తమ సరికొత్త 150సీసీ మోటార్‌సైకిల్ 'సుజుకి జిక్సర్' (Suzuki Gixxer)ను నేడు (సెప్టెంబర్ 09, 2014) మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ధరను రూ. 72,199 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న 150సీసీ బైక్ సుజుకి జిఎస్150ఆర్‌కు ఎగువన దీనిని ప్రవేశపెట్టనున్నారు.

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తొలిసారిగా ఈ బైక్‌ను 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ప్రత్యేకించి నేటి యువతను లక్ష్యంగా చేసుకొని ఈ బైక్‌ను స్టయిలిష్‌గా తీర్చిదిద్దారు. ఈ బైక్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఉపయోగించారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ, ఇప్పటికే హోండా అందిస్తున్న 'హోండా ఈకో టెక్నాలజీ' (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది.

ఈ టెక్నాలజీ వలన ఇంజన్ మెకానికల్ లాసెస్ తగ్గి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌లు పెరగటంతో పాటు మెరుగైన మైలేజీని కూడా పొందవచ్చు. సుజుకి జిక్సర్ 150సీసీ బైక్ సెగ్మెంట్లో హీరో హంక్, హోండా సిబి ట్రిగ్గర్, బజాజ్ పల్సర్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్ విడుదల

స్ట్రీట్ స్పోర్ట్ మోటార్‌సైకిల్‌గా పిలిచే సుజుకి జిక్సర్ 150సీసీ బైక్‌ను, కంపెనీ విక్రయిస్తున్న పవర్‌ఫుల్ 1000సీసీ బైక్ జిఎస్ఎక్స్-ఆర్1000 నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాతి స్లైడ్‌లలో తెలుసుకోండి.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్ విడుదల

సుజుకి జిక్సర్‌లో 154.9సీసీ, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి (సింగిల్ ఓవర్ హెడ్ కామ్‌షాఫ్ట్) పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 13.9 పిఎస్‌ల శక్తిని, 19.4 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్, కిక్ స్టార్ట్ ఆప్షన్స్ రెండూ ఉంటాయి.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్ విడుదల

సుజుకి జిక్సర్ డిజైన్‌ను గమనిస్తే, దీని హెడ్‌‌లైట్ నుంచి టెయిల్ లైట్ వరకు ప్రతి డిజైన్ ఎలిమెంట్ కూడా ఎంతో స్టయిలిష్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్ విడుదల

సుజుకి జిక్సర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీనిచ్చేందుకు సహకరిస్తుంది.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్ విడుదల

సుజుకి జిక్సర్‌లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను వెనుక వైపు మోనోషాక్, స్వింగ్ఆర్మ్ టైప్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు. సుజుకి జిక్సర్‌లో ముందువైపు డిస్క్ బ్రేక్స్‌ను వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్ విడుదల

సుజుకి జిక్సర్ కాస్ట్ అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. దీని ఫ్రంట్ టైర్ సైజ్ 100/80-17, వెనుక టైరు సైజ్ 140/60-17. సుజుకి జిక్సర్ ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్ విడుదల

పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, బాడీ కలర్డ్ గ్రాబ్ రెయిల్స్, ట్విన్ ఎగ్జాస్ట్స్ మొదలైనవి ఈ బైక్‌లో చెప్పుకోదగిన ఇతర ఫీచర్లు.

Most Read Articles

English summary
Suzuki Motorcycle India has launched the much awaited Gixxer 155cc motorcycle at a price of Rs 72,199 (ex-showroom Delhi).
Story first published: Tuesday, September 9, 2014, 16:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X