రిఫ్రెష్డ్ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ విడుదల

జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్స్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న యాక్సెస్ 125సీసీ స్కూటర్‌లో ఓ రిఫ్రెష్డ్ మోడల్‌ను విడుదల చేసింది. ఇదివరకటి యాక్సెస్ స్కూటర్‌తో పోల్చుకుంటే, కొత్త రిఫ్రెష్డ్ వెర్షన్ యాక్సెస్ స్కూటర్‌లో కొన్ని చెప్పుకోదగిన కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.

ఇందులో ప్రధానంగా కొత్త యాక్సెస్ బ్యాడ్జ్, సరికొత్త స్టీల్ ఫ్రంట్ మడ్‌గార్డ్, సేఫ్టీ షట్టర్‌తో కూడిన సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, పిలియన్ రైడర్ కోసం అల్యూమినియం గ్రాబ్ రెయిల్, ట్యూబ్‌లెస్ టైర్స్ మరియు మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీలను కంపెనీ ఈ కొత్త రిఫ్రెష్డ్ వెర్షన్ యాక్సెస్ స్కూటర్‌లో ఆఫర్ చేస్తోంది.

ఈ రిఫ్రెష్డ్ వెర్షన్ సుజుకి యాక్సెస్ 125సీసీ స్కూటర్‌లో కంపెనీ కొత్త పెయింట్ షేడ్స్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. మెటాలిక్ సోనిక్ సిల్వర్, మెటాలిక్ మ్యాట్ ఫిబ్రోయిన్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లను సుజుకి ప్రవేశపెట్టింది. ఇవి కాకుండా, ఇది రెగ్యులర్ గ్లాస్ స్పార్కల్ బ్లాక్, క్యాండీ ఆంటారెస్ రెడ్, పెరల్ మిరాజ్ వైట్ రంగులలో కూడా లభ్యమవుతుంది.

Suzuki India Launch Refreshed Access 125cc Scooter

కొత్త సుజుకి యాక్సెస్‌లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మినహా మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు. ఇందులో అదే 125సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8.58 హార్స్ పవర్‌ల శక్తిని, 9.8 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కిక్/సెల్ఫ్ స్టార్ట్ ఫీచర్లతో లభిస్తుంది. దీని అండర్ సీట్ స్టోరేజ్ సామర్థ్యం 20 లీటర్లు.

దేశీయ విపణిలో ఈ కొత్త రిఫ్రెష్డ్ వెర్షన్ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ధరను కంపెనీ రూ.53,223 (ఆన్-రోడ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. త్వరలోనే ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సుజుకి మోటార్‌సైకిల్ డీలర్‌షిప్‌లలో లభ్యం కానుంది.

Most Read Articles

English summary
The Japanese two wheeler manufacturer Suzuki has provided its Access 125 with a refreshed design after seven long years. The refreshed Access 125 by Suzuki Motorcycle has been priced at INR 53,223 OTR, New Delhi. 
Story first published: Tuesday, August 26, 2014, 13:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X