హైదరాబాద్‌లో సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ విడుదల

By Ravi

హైదరాబాద్: జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్ ఇటీవలే భారత విపణిలో విడుదల చేసిన తమ కొత్త 110సీసీ స్కూటర్ 'సుజుకి లెట్స్' (Suzuki Let's)ను కంపెనీ తాజాగా రాష్ట్ర విపణిలో ప్రవేశపెట్టింది. రాష్ట్ర మార్కెట్లో దీని ధర రూ.45,748 (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) ఉంది. ఈ స్కూటర్ విడుదల సందర్భంగా సుజుకి మోటార్‌సైకిల్ వైస్ ప్రెసిడెంట్ కెంజీ హీరోజవా మాట్లాడుతూ భారతీయ అవసరాలకు అనుగుణంగా అత్యధిక మైలేజీనిచ్చే విధంగా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు.

సుజుకి లెట్స్ స్కూటర్‌ను ప్రత్యేకించి నేటి యువతను (18-25 ఏళ్ల వయస్సు కలిగిన వారిని) లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేశారు. ఆకర్షనీయమైన స్టయిలిష్ డిజైన్, బెటర్ పెర్ఫార్మెన్స్, బెటర్ మైలేజ్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని దీనిని తయారు చేశారు. సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీకి ఇదే తొలి 110సీసీ స్కూటర్. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా డియోతో నేరుగా పోటీపడనుంది.

సుజుకి లెట్స్ స్కూటర్‌లో 112.8సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.0 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సివిటి ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ సెల్ఫ్, కిక్ స్టార్ట్ ఆప్షన్‌తో లభిస్తుంది.

Suzuki Lets Hyderabad

సుజుకి లెట్స్ స్కూటర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది. సుజుకి ఎస్ఈపి టెక్నాలజీ ద్వారా ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీ లభిస్తుంది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, సుజుకి లెట్స్ స్కూటర్‌ లీటరు పెట్రోలుకు గరిష్టంగా 63 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్‌కు లోబడి). సుజుకి లెట్స్ స్కూటర్‌లో ముందువైపు టెలిస్కోపిక్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్ సస్పెన్షన్‌ను అలాగే వెనుక వైపు స్వింగ్ఆర్మ్ టైప్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు. దీని మొత్తం బరువు 98 కిలోలు మాత్రమే. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు. సుజుకి లెట్స్ ఈ సెగ్మెంట్లో హోండా యాక్టివా, హీరో ప్లెజర్ వంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Most Read Articles

English summary
Suzuki Motorcycle India has launched its first personal 110cc scooter Suzuki Let's in Hyderabad. The 110cc segment Let's is available at an introductory price of Rs 45,748 lakh (ex-showroom Hyderabad).
Story first published: Tuesday, May 27, 2014, 9:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X