సుజుకి లెట్స్ 110సీసీ స్కూటర్ ధర వెల్లడి!

By Ravi

జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకి మోటార్‌సైకిల్ గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కిరంచిన కొత్త 110సీసీ స్కూటర్ సుజుకి లెట్స్ (Suzuki Let's) కోసం కంపెనీ డీలర్లు ఇప్పటికే బుకింగ్‌లను స్వీకరిస్తున్నారని, ఇది ఈ నెలాఖరు నాటికి కస్టమర్లకు అందుబాటులోకి రానుందని మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.

మరికొద్ది రోజుల్లో ఈ స్కూటర్‌‍ను మార్కెట్లో విడుదల చేయనున్న నేపథ్యంలో, కంపెనీ దీని ధరను వెల్లడి చేసింది. సుజుకి లెట్స్ స్కూటర్ ధరను రూ.45,172 (ఎక్స్-షోరూమ్, పూనే)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. సుజుకి లెట్స్ స్కూటర్‌ను ప్రత్యేకించి నేటి యువతను (18-25 ఏళ్ల వయస్సు కలిగిన వారిని) లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేశారు. సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీకి ఇది తొలి 110సీసీ స్కూటర్.

Suzuki Lets Price

సుజుకి లెట్స్ స్కూటర్‌లో 112.8సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.0 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సివిటి ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ సెల్ఫ్, కిక్ స్టార్ట్ ఆప్షన్‌తో లభిస్తుంది.

సుజుకి లెట్స్ స్కూటర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది. సుజుకి ఎస్ఈపి టెక్నాలజీ ద్వారా ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీ లభిస్తుంది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, సుజుకి లెట్స్ స్కూటర్‌ లీటరు పెట్రోలుకు గరిష్టంగా 63 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది (స్టాండర్డ్ రైడింగ్ కండిషన్స్‌కు లోబడి). సుజుకి లెట్స్ స్కూటర్‌లో ముందువైపు టెలిస్కోపిక్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్ సస్పెన్షన్‌ను అలాగే వెనుక వైపు స్వింగ్ఆర్మ్ టైప్, కాయిల్ స్ప్రింగ్, ఆయిల్ డ్యాంప్డ్ సస్పెన్షన్‌ను ఉపయోగించారు.


సుజుకి లెట్స్ స్కూటర్‌లో ముందువైపు అలాగే వెనుక వైపు 120 మి.మీ. డయా డ్రమ్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. సుజుకి లెట్స్ స్కూటర్‌ ట్యూబ్‌లెస్ టైర్లతో లభిస్తుంది. దీని ఫ్రంట్ టైర్ సైజ్ 90/100-10, వెనుక టైరు సైజ్ 90/100-10. సుజుకి జిక్సర్ ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో (పెరల్ మిరా రెడ్, మెటాలిక్ ట్రైటన్ బ్లూ, పెరల్ మిరేజ్ వైట్, గ్లాస్ స్పార్కల్ బ్లాక్, మెటాలిక్ సోనిక్ సిల్వర్) లభ్యం కానుంది.

సుజుకి లెట్స్ స్కూటర్ 1810 మి.మీ. పొడవును, 660 మి.మీ. వెడల్పును, 1120 మి.మీ. ఎత్తును, 1250 మి.మీ. వీల్‌బేస్‌ను, 160 మి.మీ. గ్రౌండ్ క్లియరెన్స్‌ను మరియు 765 మి.మీ. సీట్ ఎత్తును కలిగి ఉంటుంది. దీని మొత్తం బరువు 98 కిలోలు మాత్రమే. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.2 లీటర్లు. సుజుకి లెట్స్ ఈ సెగ్మెంట్లో హోండా యాక్టివా, హీరో ప్లెజర్ వంటి స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Most Read Articles

English summary
Suzuki had revealed their new 110cc automatic scooter the Let's at the Auto Expo held in Greater Noida, Delhi in February 2014. Now the Japanese automobile manufacturer has announced a price tag of Rs 45,172 (ex-showroom, Pune) for its Let's. 
Story first published: Tuesday, May 6, 2014, 16:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X