సుజుకి నుంచి కొత్త 110సీసీ స్కూటర్, అప్‌డేటెడ్ హయాటే

By Ravi

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా భారత ద్విచక్ర వాహన విభాగంలో తన మార్కెట్ వాటాను పెంచుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా.. బడ్జెట్ సూపర్‌బైక్ 'ఇనాజుమా జిడబ్ల్యూ 250'ని ప్రవేశపెట్టిన సుజుకి, ఇప్పుడు ఓ 110సీసీ బడ్జెట్ స్కూటర్‌ను అలాగే తమ బడ్జెట్ మోటార్‌సైకిల్ హయాటేను అప్‌డేట్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

సుజుకి నుంచి రానున్న ఓ కొత్త స్కూటర్‌లో 110సీసీ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ప్రస్తుతం సుజుకి అందిస్తున్న యాక్సిస్, స్విష్ స్కూటర్లలో 125సీసీ ఇంజన్‌ను మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సుజుకి 110సీసీ స్కూటర్‌ను విడుదల చేయటం ద్వారా ఈ సెగ్మెంట్లోకి తొలిసారిగా ప్రవేశించాలనియోచిస్తోంది.


సుజుకి కొత్త స్కూటర్‌లో 110సీసీ, సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌ను ఉపయోగిచనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7-8 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేయవచ్చని అంచనా. తక్కువ సీసీ ఇంజన్ కావటం వలన ఇది మెరుగైన మైలేజీని ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, సుజుకి గడచిన 2012 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన 110సీసీ బడ్జెట్ మోటార్‌సైకిల్ సుజుకి హయాటే‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేస్తుంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త అప్‌డేట్ హయాటేలో కాస్మోటిక్ మార్పులతో పాటుగా యాంత్రికపరమైన మార్పులు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. మరింత మెరుగైన మైలేజీనిచ్చేలా దీని ఇంజన్‌ను రీట్యూన్ చేయనున్నట్లు సమాచారం.

Suzuki Hayate

ప్రస్తుతం సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లిమిటెడ్ విక్రయిస్తున్న మోటార్‌సైకిళ్లలో హయాటే, స్లింగ్‌షాట్ ప్లస్, జిఎస్150ఆర్‌ ఇనాజుమాలతో పాటుగా యాక్సిస్ 125, స్విష్ 125 స్కూటర్లను ఆఫర్ చేస్తోంది. వీటితో పాటుగా జిఎస్ఎక్స్-ఆర్1000, జిఎస్ఎక్స్-ఆర్1000జెడ్ (లిమిటెడ్ ఎడిషన్), హయబుసా, హయబుసా (లిమిటెడ్ ఎడిషన్), బాండిట్ 1250ఎస్ఏ, ఇంట్రుడర్ ఎమ్1800ఆర్, ఇంట్రుడర్ ఎమ్1800ఆర్ బాస్ ఎడిషన్, ఇంట్రుడర్ ఎమ్800 సూపర్‌బైక్‌లను కూడా సుజుకి విక్రయిస్తోంది.
Most Read Articles

English summary
Suzuki Motorcycle India is planing to launch a new 110cc scooter and updated Hayate motorcycle. The new scooter will be powered by a newly developed 110cc, single-cylinder, four-stroke engine. The new Hayate variant will get few cosmetic changes along with mechanical changes, improving its fuel efficiency.
Story first published: Wednesday, January 22, 2014, 10:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X