త్వరలో సుజుకి జిక్సర్ బైక్ విడుదల; టెక్నికల్ డిటేల్స్

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఈ ఏడాది జనవరి నెలలో ఆవిష్కరించిన 155సీసీ బైక్ 'సుజుకి జిక్సర్' (Suzuki Gixxer) మరో నెల రోజుల తర్వాత మార్కెట్లో విడుదల కానుంది. ప్రత్యేకించి యువతను లక్ష్యంగా చేసుకొని సుజుకి తమ జిక్సర్ బైక్‌ను అభివృద్ధి చేసింది.

సుజుకి జిక్సర్ 150సీసీ బైక్ సెగ్మెంట్లో హీరో హంక్, హోండా సిబి ట్రిగ్గర్, బజాజ్ పల్సర్ వంటి మోడళ్లను టార్గెట్ చేయనుంది. సుజుకి అందిస్తున్న జిఎస్ఎక్స్-ఆర్ 1000సీసీ బైక్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కొత్త సుజుకి జిక్సర్‌ను డిజైన్ చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఈ బైక్ ఇండోనేషియన్ మార్కెట్లో కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, సుజుకి జిక్సర్ బైక్‌కు సంబంధించి కొన్ని టెక్నికల్ డిటేల్స్ విడుదలయ్యాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

సుజుకి జిక్సర్ టెక్నికల్ డిటేల్స్

సుజుకి జిక్సర్ డిజైన్‌ను గమనిస్తే, దీని హెడ్‌‌లైట్ నుంచి టెయిల్ లైట్ వరకు ప్రతి డిజైన్ ఎలిమెంట్ కూడా ఎంతో స్టయిలిష్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది.

సుజుకి జిక్సర్ టెక్నికల్ డిటేల్స్

సుజుకి జిక్సర్‌లో 155సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి (సింగిల్ ఓవర్ హెడ్ కామ్‌షాఫ్ట్) పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 13.9 పిఎస్‌ల శక్తిని, 19.4 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిక్, కిక్ స్టార్ట్ ఆప్షన్స్ రెండూ ఉంటాయి.

సుజుకి జిక్సర్ టెక్నికల్ డిటేల్స్

సుజుకి జిక్సర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇంజన్ మెకానికల్ లాసెస్‌ను తగ్గించి, పవర్ మరియు పెర్ఫామెన్స్‌ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన మైలేజీనిచ్చేందుకు సహకరిస్తుంది.

సుజుకి జిక్సర్ టెక్నికల్ డిటేల్స్

సుజుకి జిక్సర్‌లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను వెనుక వైపు మోనోషాక్, స్వింగ్ఆర్మ్ టైప్ సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు. సుజుకి జిక్సర్‌లో ముందువైపు డిస్క్ బ్రేక్స్‌ను వెనుక వైపు డ్రమ్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

సుజుకి జిక్సర్ టెక్నికల్ డిటేల్స్

సుజుకి జిక్సర్ కాస్ట్ అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. దీని ఫ్రంట్ టైర్ సైజ్ 100/80-17, వెనుక టైరు సైజ్ 140/60-17. సుజుకి జిక్సర్ ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది.

సుజుకి జిక్సర్ టెక్నికల్ డిటేల్స్

దేశీయ విపణిలో సుజుకి జిక్సర్ ధర సుమారు రూ.75,000 రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. జూన్ లేదా జులై 2014 నుంచి సుజుకి జిక్సర్ అమ్మకాలు వాణిజ్యం పరంగా ప్రారంభం అవుతాయి.

Most Read Articles

English summary
Suzuki India had revealed their new motorcycle the Gixxer just before the 2014 Auto Expo. During the unveil with their brand ambassador Salman Khan, the Japanese manufacturer did not reveal any engine details or tech specs. The Gixxer is due to launch in June, 2014 at Indonesia and we thus, have details of the bike.
Story first published: Tuesday, May 27, 2014, 10:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X