ఆటో ఎక్స్‌పో 2014: సుజుకి నుంచి 4 కొత్త ఉత్పత్తుల విడుదల

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ సుజుకి మోటర్‌సైకిల్‌ ఇండియా లిమిటెడ్‌ నాలుగు కొత్త మోడళ్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోను వేదికగా చేసుకొని, సుజుకి 'వి స్ట్రోమ్‌-1000', 'ఇనాజుమా', 'గిక్సర్‌' మరియు 'లెట్స్‌' మోడళ్లను విడుదల చేసింది.

ఈ నాలుగు ఉత్పత్తులలో సుజుకి వి-స్ట్రోమ్ 1000 సూపర్‌బైక్ కాగా, ఇనాజుమా 250సీసీ బడ్జెట్ స్పోర్ట్స్ బైక్. ఇకపోతే గిక్సర్ ఓ 150సీసీ బైక్, లెట్స్ ఓ 110సీసీ స్కూటర్.

సుజుకి జిక్సర్‌లో 155సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది ఎలక్ట్రిక్, కిక్ స్టార్ట్ ఆప్షన్‌తో లభిస్తుంది. సుజుకి జిక్సర్‌లో కొత్తగా 'సుజుకి ఈకో పెర్ఫామెన్స్' (ఎస్ఈపి) టెక్నాలజీని ఆఫర్ చేస్తున్నారు. సుజుకి అందిస్తున్న ఈ ఎస్ఈపి టెక్నాలజీ ఇప్పటికే హోండా అందిస్తున్న హోండా ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి) మాదిరిగానే ఉంటుంది.


సుజుకి లెట్స్ స్కూటర్‌లో 112.8సీసీ 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్‌సి, 2-వాల్వ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 హెచ్‌పిల శక్తిని, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.0 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో సివిటి ట్రాన్సిమిషన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ సెల్ఫ్, కిక్ స్టార్ట్ ఆప్షన్‌తో లభిస్తుంది. లెట్స్ స్కూటర్‌ లీటరు పెట్రోలుకు గరిష్టంగా 63 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

జపనీస్ భాషలో 'ఇనాజుమా' అంటే తుఫాను సమయంలో వచ్చే భారీ 'మెరుపు' అని అర్థం. ఈ పేరుకు సార్థకత కల్పించేలా తమ ఇనాజుమాను డిజైన్ చేశామని, ఇందులోని శక్తివంతమైన 250సీసీ ఇంజన్ సాటిలేని పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో శక్తివంతమైన 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 26 బిహెచ్‌పిల శక్తిని, 24 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంటుంది. మార్కెట్లో దీని ధరను రూ.3.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

Suzuki Lets Scooter

సుజుకి వి-స్టోర్మ్ 1000 ఏబిఎస్ మోటార్‌సైకిల్‌ను ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన వి-స్టోర్మ్ 650 ఏబిఎస్ మోడల్‌ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. ఇది ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో లభిస్తుంది. వి-స్టోర్మ్ 1000 ఏబిఎస్ ఇంక్రెడిబల్ వెర్సటాలిటీ, కంఫర్ట్ అండ్ ఫన్ టూ రైడ్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.
Most Read Articles

English summary
Suzuki Motorcycle India Limited (SMIL), a subsidiary of one of the world’s leading two-wheeler manufacturers Suzuki Motor Corporation, Japan today unveiled the much awaited motorcycles V Strom 1000, Inazuma and Gixxer along with scooter Let’s at the 12th Auto Expo.
Story first published: Thursday, February 6, 2014, 18:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X