ఆటో ఎక్స్‌పో 2014లో టెర్రా ఎలక్ట్రిక్ స్కూటర్, త్రీవీలర్స్

By Ravi

జపాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెర్రా మోటార్స్ ఈ ఏడాది భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఫిబ్రవరి 2014లో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టెర్రా మోటార్స్ తమ ఉత్పత్తులను భారతీయులకు పరిచయం చేయనుంది.

ఈ 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో కేవలం తమ ఉత్పత్తులను ప్రదర్శించడమే కాకుండా, విడుదల కూడా చేస్తామని కంపెనీ తెలిపింది. టెర్రా మోటార్స్ విడుదల చేయనున్న ఉత్పత్తుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్ ఉండనున్నాయి.

టెర్రా మోటార్స్ ఇండియా కంట్రీ మేనేజర్ టెప్పీ సేకీ ఈ విషయంపై మాట్లాడుతూ.. భారత్‌లో తమ వాణిజ్య ప్రయాణం గురించి త్వరలోనే ఓ ప్రకటన చేస్తామని, ఆటో ఎక్స్‌పోలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను విడుదల చేస్తామని చెప్పారు.

టెర్రా ఎలక్ట్రిక్ స్కూటర్

టెర్రా మోటార్స్ గడచిన సంవత్సరం జులై నెలలో జపానా రాజధాని టోక్యో నగరంలో 'టెర్రా ఏ4000ఐ' (Terra A4000i) అనే ఓ అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ స్కూటర్‌ను భారత మార్కెట్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

టెర్రా ఎలక్ట్రిక్ స్కూటర్

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఐఫోన్ సాయంతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లో ఐఫోన్‌ను ఫిక్స్ చేయటం ద్వారా బ్యాటరీ స్టేటస్, బ్యాటరీ ఖర్చయ్యే రేటు, ప్రయాణించే వేగం, మిగిలి ఉన్న బ్యాటరీతో ఎంత దూరం ప్రయాణించవచ్చు వంటి అనేక సాంకేతిక వివరాలను ఐఫోన్ సాయంతో తెలుసుకోవచ్చు.

టెర్రా ఎలక్ట్రిక్ స్కూటర్

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌లో అమర్చిన ఐఫోన్ జిపిఎస్ నావిగేటర్ మాదిరిగా కూడా పనిచేసి, దిశానిర్ధేశం చేస్తుంది. ప్రస్తుతానికి ఈ స్కూటర్ ఐఫోన్లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే, త్వరలోనే అన్ని రకాల స్మార్ట్‌ఫోన్లతో పనిచేసేలా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

టెర్రా ఎలక్ట్రిక్ స్కూటర్

టెర్రా ఏ4000ఐ ఎలక్ట్రిక్ స్కూటర్‌ 48 వోల్ట్ లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో నడుస్తుంది. ఈ బ్యాటరీ జీవిత కాలం 50,000 కి.మీ. ఇది కేవలం 4.5 గంటల సమయంలోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. పూర్తి చార్జ్‌పై 65 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.

టెర్రా ఎలక్ట్రిక్ స్కూటర్

టెర్రా ఏ4000ఐ గరిష్ట వేగం గంటకు 65 కి.మీ., సగటు వేగం గంటకు 48 కి.మీ. ఈ స్కూటర్‌కు ముందు, వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లను అమర్చారు. దీని మొత్తం బరువు 118 కేజీలు (బ్యాటరీ బరువు 16 కేజీలు).

టెర్రా ఎలక్ట్రిక్ స్కూటర్

భారత మార్కెట్లో ఈ స్కూటర్ ధర సుమారు రూ.2 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Teppei Seki, country manager, Terra Motors India, said, “we will soon make an official announcement over our presence in India and will launch our electric scooters, and three-wheelers at the Auto Expo.”
Story first published: Tuesday, January 21, 2014, 16:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X