హెల్మెట్ ధరిస్తేనే బైక్ స్టార్ అవుతుంది, ఇదెట్టా సాధ్యం?

By Ravi

మనదేశంలో అత్యధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. దీనికితోడు దేశంలో ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు, వినియోగం కూడా నానాటికీ పెరిగిపోతుంది. మరోవైపు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే మోటారిస్టులు కూడా ఎక్కువ అవుతున్నారు. ఫలితంగా హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది.

ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాల్సిందిగా అనేక ప్రకటనలు, ప్రచారాల ద్వారా ప్రజలకు వివరిస్తున్నప్పటికీ, వారు వీటిని పెడచెవినపెట్టేస్తున్నారు. హెల్మెట్ ధరించనుందుకు పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నా కొందరిలో మార్పు రావటం లేదు.

The Good Road

ఈ నేపథ్యంలో, 'ది గుడ్ రోడ్' అనే గ్రూప్ ఓ సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఈ గ్రూప్ ఓ అధునాతన వైర్‌లెస్ హెల్మెట్‌ను తయారు చేసింది. ఈ హెల్మెట్‌కు బైక్‌కు సెకండరీ కీగా పనిచేస్తుంది. ఈ హైటెక్ హెల్మెట్‌ను సిర్ససుపై పెట్టుకోగానే ఇంజన్ స్టార్ట్ అవుతుంది అదే సిరస్సుపై నుంచి హెల్మెట్ తీసేస్తే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. దీని డెమోను క్రింది వీడియోలో చూడొచ్చు.

ఈ హెల్మెట్ కెపాసిటివ్ టచ్ టెక్నాలజీని ఆధారంగా పనిచేస్తుంది. రైడర్ దీనిని ధరించగానే ఆ స్పర్శకు ఇది యాక్టివేట్ అవుతుంది. ఇందులో ఓ రీచార్జబల్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే దీనిని ఆరు నెలల వరకు చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందులో సోలార్ చార్జింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఈ గుడ్ రోడ్ ప్రణాళికను క్యాస్ట్రాల్, బెంగుళూరు ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌లు సపోర్ట్ చేస్తున్నాయి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/NvISHezDqrU" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
To encourage more people to wear helmets, a group called "The Good Road" has come up with a novel plan which involves a simple, yet potentially effective idea. The group has developed a special wireless helmet that is paired with a bike, acting as a secondary key.&#13;
Story first published: Friday, April 25, 2014, 10:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X