హీరో ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్ బైక్‌ని ఆవిష్కరించిన టైగర్ ఉడ్స్

By Ravi

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, అంతర్జాతీయ మార్కెట్లలో తమ ఉత్పత్తులను ప్రచారం చేసేందుకు గాను, అమెరికన్ గోల్ఫ్ దిగ్గజం టైగర్ ఉడ్స్‌ను కంపెనీ తమ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, తాజాగా టైగర్ ఉడ్స్ చేతుల మీదుగా హీరో మోటోకార్ప్ తమ సరికొత్త ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్ 150సీసీ బైక్‌ను ఆవిష్కరింపజేసింది. టైగర్ ఉడ్స్ నాలుగేళ్ల పాటు హీరో మోటోకార్ప్‌కు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు.

ఇక హీరో ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్ విషయానికి వస్తే.. హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేసిన సరికొత్త 2014 హీరో ఎక్స్‌ట్రీమ్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్స్ స్పోర్ట్స్ వేరియంట్‌ను తయారు చేశారు. ఈ రెండు బైక్‌ల బేసిక్ డిజైన్ ఇంచు మించు ఒకేలా ఉంటుంది. అయితే, ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్‌కు మరింత ప్రీమియం స్పోర్టీ లుక్‌నిచ్చేందుకు గాను ఇందులో కొన్ని కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ చేయటంతో, కొన్ని ప్రీమియం ఫీచర్లను కూడా జోడించారు.


కొత్త 2014 హీరో ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్‌లో కూడా ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్ ఫీచర్‌ను ఆఫర్ చేయనున్నారు. ఇంజన్ ఇమ్మొబిలైజర్ అనేది కార్లలో ఉండే ఓ సెక్యూరిటీ ఫీచర్. ఇమ్మొబిలైజర్ అంటే ఆ వాహనానికి సంబంధించిన సరైన తాళం చెవిని వాడితేనే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. వేరే తాళంతో ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే, అలారం మ్రోగి చుట్టుప్రక్కల వారిని అప్రమత్తం చేస్తుంది. ఈ ఫీచర్ 150సీసీ సెగ్మెంట్లోనే మొట్టమొదటిది.

ఇది కూడా చదవండి: హీరో ఎక్స్ట్రీమ్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ

హీరో ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్‌లో 149.2సీసీ ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సి ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 14.4 పిఎస్‌ల శక్తిని, 6500 ఆర్‌పిఎమ్ వద్ద 12.80 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ కాన్స్టాంట్ మెష్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

New Xtreme Sport By Hero MotoCorp

ఇంకా ఇందులో.. ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, పెద్ద టైర్లు, సైడ్ స్టాండ్ అలెర్ట్, మొబైల్ చార్జింగ్ డాక్, స్పోర్ట్స్ డెకాల్, ఇంజన్ ప్రొటెక్షన్ గార్డ్, రీడిజైన్డ్ ఫ్యూయెల్ ట్యాంక్, టూటోన్ రియర్ వ్యూ మిర్రర్స్, ఎల్ఈడి హెడ్‌లైట్స్, బ్లూలైట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లు లభ్యం కానున్నాయి. ఈ బైక్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.
Most Read Articles

English summary
Hero MotoCorp revealed to the audience present their Xtreme Sport motorcycle with their global ambassador. The motorcycle was showcased in the presence of Zach Johnson, defending champion. Also present where the top 18 players of PGA Tour, who stood a chance to win USD 3.5 million in prize money.
Story first published: Monday, December 8, 2014, 12:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X