భారత్‌లో లభిస్తున్న టాప్ 10 ఫాస్టెస్ట్ సూపర్‌బైక్స్

By Ravi

భారత్‌లో స్పీడ్ మరియు లగ్జరీని ఇష్టపడే సంపన్న యువ కొనుగోలుదారుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని, అంతర్జాతీయ ప్రీమియం బైక్ కంపెనీలు భారత్‌కు వలస వస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడి మార్కెట్లో ఉన్న మరికొన్ని కంపెనీలు సరికొత్త ఉత్పత్తులను మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాయి.

ప్రస్తుతం భారత మార్కెట్లో అనేక రకాల సూపర్‌బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. హోండా సిబిఆర్ 1000ఆర్ఆర్ మొదలుకొని డ్యుకాటి డయావెల్ వరకు వివిధ బైక్‌లు లభిస్తున్నాయి. ఈ కథనంలో మనం దేశీయ విపణిలో వినియోగదారులకు అందుబాటులో ఉన్న టాప్ 10 ఫాస్టెస్ట్ సూపర్‌ బైక్స్ గురించి తెలుసుకుందా రండి..!

1. బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్

1. బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ అందిస్తున్న ఎస్1000ఆర్ఆర్ సూపర్‌బైక్‌లో 999సీసీ ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 193 బిహెచ్‌పిల శక్తిని, 112 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

టాప్ స్పీడ్: 305 కెఎమ్‌పిహెచ్

ధర: రూ.18.02 లక్షలు (ఎక్స్-షోరూమ్)

2. సుజుకి హయబుసా

2. సుజుకి హయబుసా

సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ అందిస్తున్న హయబుసా సూపర్‌బైక్‌లో 1340సీసీ ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 197 బిహెచ్‌పిల శక్తిని, 138 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

టాప్ స్పీడ్: 300 కెఎమ్‌పిహెచ్

ధర: రూ.13.75 లక్షలు (ఎక్స్-షోరూమ్)

3. కవాసకి నిన్జా జెడ్ఎక్స్-14ఆర్

3. కవాసకి నిన్జా జెడ్ఎక్స్-14ఆర్

కవాసకి ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన నిన్జా జెడ్ఎక్స్-14ఆర్ సూపర్‌బైక్‌లో 1441సీసీ ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 197 బిహెచ్‌పిల శక్తిని, 162 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

టాప్ స్పీడ్: 300 కెఎమ్‌పిహెచ్

ధర: రూ.16.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)

4. ఆప్రిలియా ఆర్ఎస్‌వి4-ఆర్

4. ఆప్రిలియా ఆర్ఎస్‌వి4-ఆర్

పియాజ్జియోకి చెందిన మోటార్‌సైకిల్ బ్రాండ్ ఆప్రిలియా అందిస్తున్న ఎర్ఎస్‌వి4-ఆర్ సూపర్‌బైక్‌లో 999సీసీ వి-కాన్ఫిగరేషన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 184 బిహెచ్‌పిల శక్తిని, 117 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

టాప్ స్పీడ్: 297 కెఎమ్‌పిహెచ్

5. హోండా సిబిఆర్ 1000ఆర్ఆర్

5. హోండా సిబిఆర్ 1000ఆర్ఆర్

కవాసకి ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన నిన్జా జెడ్ఎక్స్-14ఆర్ సూపర్‌బైక్‌లో 999సీసీ ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 177 బిహెచ్‌పిల శక్తిని, 112 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

టాప్ స్పీడ్: 297 కెఎమ్‌పిహెచ్

ధర: రూ.15.46 లక్షలు (ఎక్స్-షోరూమ్)

6. కవాసకి జెడ్ఎక్స్-10ఆర్

6. కవాసకి జెడ్ఎక్స్-10ఆర్

కవాసకి ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన జెడ్ఎక్స్-10ఆర్ సూపర్‌బైక్‌లో 998సీసీ ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 197 బిహెచ్‌పిల శక్తిని, 112 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

టాప్ స్పీడ్: 295 కెఎమ్‌పిహెచ్

ధర: రూ.15.70 లక్షలు (ఎక్స్-షోరూమ్)

7. సుజుకి జిఎస్ఎక్స్-ఆర్1000

7. సుజుకి జిఎస్ఎక్స్-ఆర్1000

సుజుకి మోటార్‌సైకిల్ అందిస్తున్న జిఎస్ఎక్స్-ఆర్1000 సూపర్‌బైక్‌లో 999సీసీ ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 191 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

టాప్ స్పీడ్: 288 కెఎమ్‌పిహెచ్

ధర: రూ.13.00 లక్షలు (ఎక్స్-షోరూమ్)

8. యమహా వైజెడ్ఆఫ్ ఆర్1

8. యమహా వైజెడ్ఆఫ్ ఆర్1

యమహా ఇండియా అందిస్తున్న వైజెడ్ఎఫ్ ఆర్1 సూపర్‌బైక్‌లో 998సీసీ ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 180 బిహెచ్‌పిల శక్తిని, 115.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

టాప్ స్పీడ్: 285 కెఎమ్‌పిహెచ్

ధర: రూ.12.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)

9. ఆప్రిలియా టువానో వి4ఆర్

9. ఆప్రిలియా టువానో వి4ఆర్

ఆప్రిలియా అందిస్తున్న టువానో వి4ఆర్ సూపర్‌బైక్‌లో 999సీసీ వి-కాన్ఫిగరేషన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 167 బిహెచ్‌పిల శక్తిని, 111.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

టాప్ స్పీడ్: 270 కెఎమ్‌పిహెచ్

ధర: రూ.19.32 లక్షలు (ఎక్స్-షోరూమ్)

10. డ్యుకాటి డయావెల్

10. డ్యుకాటి డయావెల్

డ్యుకాటి అందిస్తున్న డయావెల్ సూపర్‌బైక్‌లో 1198సీసీ వి-కాన్ఫిగరేషన్ ట్విన్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 162 బిహెచ్‌పిల శక్తిని, 127.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

టాప్ స్పీడ్: 260 కెఎమ్‌పిహెచ్

ధర: రూ.25.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)

Most Read Articles

English summary
Are you a Superbike lover? Superbikes define the epitome of motorcycle design and engineering. Check out top 10 fastest superbikes that you can buy in India today.
Story first published: Monday, December 23, 2013, 15:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X