100సీసీ-110సీసీ సెగ్మెంట్లో మంచి మైలేజీనిచ్చే బైక్స్

ఇది వరకటి కథనంలో మనం భారత మార్కెట్లో లభిస్తున్న మంచి మైలేజీనిచ్చే టాప్ 5 స్కూటర్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కథనంలో మన దేశంలో లభిస్తున్న మోటార్‌సైకిళ్లలో 100సీసీ-110సీసీ సెగ్మెంట్లో అధిక మైలేజీనిచ్చే బెస్ట్ బైక్ ఏంటో తెలుసుకుందాం రండి.

ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్ ధరలు భగభగా మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొనుగోలుదారులు ఖరీదైన మరియు మైలేజ్ తక్కువ ఇచ్చే బైక్‌లను కొనుగోలు చేయటానికి బదులుగా అధిక మైలేజిస్తూ, తక్కువ ధరకే అందుబాటులో ఉండే బడ్జెట్ బైక్‌ల పైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. తయారీదారులు కూడా ఇందుకు తగినట్లుగానే మెరుగైన మైలేజీనిచ్చే బైక్‌లను ఆఫర్ చేస్తున్నారు.

100సీసీ-110సీసీ సెగ్మెంట్ బైక్స్ అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చే బ్రాండ్ హీరో, హోండా, బజాజ్, టీవీఎస్ మరియు లేటెస్ట్‌గా వచ్చిన మహీంద్రా. ప్రతి టూవీలర్ మేకర్ కూడా ఈ సెగ్మెంట్లో ఒకటి కన్నా ఎక్కువ మోడళ్లను ఆఫర్ చేస్తున్నాయి. మరి వీటిల్లో బెస్ట్ మైలేజీనిచ్చే బైక్‌లో ఏవో ఓ లుక్కేద్దాం రండి..!

టీవీఎస్ స్టార్ స్పోర్ట్

టీవీఎస్ స్టార్ స్పోర్ట్

టీవీఎస్ అందిస్తున్న స్టార్ స్పోర్ట్, స్టార్ సిటీ కన్నా మెరుగైన మైలేజీనిస్తుంది. పేరుకు తగినట్లుగానే స్పోర్టీ లుక్ కలిగిన ఈ బైక్‌లో 99.7సీసీ డ్యురాలైఫ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 8 హెచ్‌పిల శక్తిని, 7.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ స్టార్ స్పోర్ట్

టీవీఎస్ స్టార్ స్పోర్ట్

* సగటు మైలేజ్ - 65 కెఎమ్‌పిఎల్ (సిటీ, హైవే రైడింగ్ కండిషన్స్ కలిపి)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 16 లీటర్లు (రిజర్వ్ 2.5 లీటర్లు)

* ధర రూ.40,000 ఎగువన (ఎక్స్-షోరూమ్)

హీరో స్ప్లెండర్ ఎన్ఎక్స్‌జి

హీరో స్ప్లెండర్ ఎన్ఎక్స్‌జి

దేశపు నెంబర్ వన్ టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ అందిస్తున్న స్ప్లెండర్ ఎన్ఎక్స్‌జి ఈ సెగ్మెంట్లో స్ప్లెండర్ ప్రో, ప్యాషన్ ప్రో బైక్‌ల కన్నా మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఈ స్టయిలిష్ స్ప్లెండర్‌లో 97.2సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 8 హెచ్‌‌పిల శక్తిని, 8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హీరో స్ప్లెండర్ ఎన్ఎక్స్‌జి

హీరో స్ప్లెండర్ ఎన్ఎక్స్‌జి

* సగటు మైలేజ్ - 65 కెఎమ్‌పిఎల్ (సిటీ, హైవే రైడింగ్ కండిషన్స్ కలిపి)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 9.51 లీటర్లు (రిజర్వ్ 1.8 లీటర్లు)

* ధరలు రూ.42,750 నుంచి రూ.46,450 మధ్యలో (ఎక్స్-షోరూమ్)

మహీంద్రా సెంచురో

మహీంద్రా సెంచురో

లేటుగా వచ్చినప్పటికీ టూవీలర్ సెగ్మెంట్లోకి లేటెస్ట్‌గా వచ్చిన మహీంద్రా ఆఫర్ చేస్తున్న సెంచురో 110సీసీ బైక్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ మైలేజీని ఆఫర్ చేస్తుంది. విశిష్టమైన ఫీచర్లతో లభ్యమవుతున్న మహీంద్రా సెంచురో బైక్‌లో 106.7సీసీ ఎమ్‌సిఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 8 హెచ్‌పిల శక్తిని, 8.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా సెంచురో

మహీంద్రా సెంచురో

* సగటు మైలేజ్ - 70 కెఎమ్‌పిఎల్ (సిటీ, హైవే రైడింగ్ కండిషన్స్ కలిపి)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 13.7 లీటర్లు (రిజర్వ్ 1.6 లీటర్లు)

* ధర రూ.46,000 (ఎక్స్-షోరూమ్)

హోండా సిబి ట్విస్టర్

హోండా సిబి ట్విస్టర్

భారత్‌లో ఎన్ని బైక్‌లు లభిస్తున్న జపనీస్ బైక్‌లకు ఉన్న క్రేజే వేరు. ఇందుకు ప్రధాన కారణం ఆయా కంపెనీలు అందించే మన్నికైన ఇంజన్లే. హోండా అందిస్తున్న స్టయిలిష్ సిబి ట్విస్టర్ 110సీసీ బైక్ మెరుగైన మైలేజీని, సాటిలేని పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. ఇందులోని ఇంజన్ 9 హెచ్‌పిల శక్తిని, 9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా సిబి ట్విస్టర్

హోండా సిబి ట్విస్టర్

* సగటు మైలేజ్ - 70 కెఎమ్‌పిఎల్ (సిటీ, హైవే రైడింగ్ కండిషన్స్ కలిపి)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 8 లీటర్లు

* ధరలు రూ.45,159 నుంచి రూ.51,905 మధ్యలో (ఎక్స్-షోరూమ్)

బజాజ్ డిస్కవర్ 100టి

బజాజ్ డిస్కవర్ 100టి

మంచి మైలేజీనిచ్చే బైక్‌లంటే టక్కున గుర్తుకు వచ్చే మొదటి పేరు బజాజ్. బజాజ్ తాజాగా ప్రవేశపెట్టిన లేటెస్ట్ 100సీసీ డిస్కవర్ టి ఇప్పుడు మనం చెప్పుకున్న బైక్‌లన్నింటి కన్నా ఎక్కువ మైలేజీనిస్తుంది. ఇందులోని 102సీసీ ఇంజన్ 10 హెచ్‌పిల శక్తిని, 10.2 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఈ బైక్‌లన్నింటి కన్నా ధర ఎక్కువ ఉంటుంది.

బజాజ్ డిస్కవర్ 100టి

బజాజ్ డిస్కవర్ 100టి

* సగటు మైలేజ్ - 75 కెఎమ్‌పిఎల్ (సిటీ, హైవే రైడింగ్ కండిషన్స్ కలిపి)

* ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 10 లీటర్లు (రిజర్వ్ 3.5 లీటర్లు)

* ధర రూ.50,000 ఎగువన (ఎక్స్-షోరూమ్)

మరి ఏది బెస్ట్..?

మరి ఏది బెస్ట్..?

ధర, మైలేజ్, విశ్వసనీయమైన బ్రాండ్, నాణ్యమైన ఇంజన్, మెరుగైన పెర్ఫామెన్స్, స్టయిలిష్ డిజైన్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే, ఈ ఐదు బైక్‌లలో 'హోండా సిబి ట్విస్టర్'ను ది బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు.

100సీసీ-110సీసీ సెగ్మెంట్లో మంచి మైలేజీనిచ్చే బైక్స్

గమనిక: ఇందులో పేర్కొన్న మైలేజ్ వివరాలు సరాసరి సగటు మాత్రమే, ఖచ్చితమైనవి కాదని గుర్తుంచుకోగలరు. రోడ్డు, నడిపే తీరు, బైక్ కండిషన్ వంటి పలు అంశాలు మైలేజ్‌ను ప్రభావితం చేస్తాయి. ధరలు కూడా ప్రాంతాన్ని, డీలరును బట్టి మారే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
Bikes in the 100cc and 110cc commuter segment has thus become the battleground for the likes of Hero, Honda, Bajaj, TVS and Mahindra, fighting for supremacy. Each manufacturer has more than one model on offer. In our list we have shortlisted one model from each manufacturer that offers the highest fuel economy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X