ఇండియాలో బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 స్కూటర్లు!

మోటార్‌సైకిళ్లతో పోల్చుకుంటే స్కూటర్లు రైడ్ చేయటానికి చాలా కంఫర్ట్‌గా ఉన్నప్పటికీ, అవి తక్కువ మైలేజీనిస్తాయన్న ఒకే ఒక్క కారణంతో కొనుగోలుదారులు ఎక్కువగా మోటార్‌సైకిళ్లను ఎంచుకునేందుకు సిద్ధపడుతుంటారు. ఇది వాస్తవమే. స్కూటర్ల ఏరోడైనమిక్స్, మోటార్‌సైకిళ్ల ఏరోడైనమిక్స్ వేర్వేరుగా ఉంటాయి, వీటిలోని ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్) కూడా మైలేజ్‌ను ప్రభావితం చేస్తుంది.

ఏదేమైనప్పటికీ, ప్రతిరోజు తక్కువ దూరం ప్రయాణించే వారు, సిటీ రోడ్లపై ఎక్కువగా సంచరించే వారికి తరచూ గేర్లు మార్చుకునే మోటార్‌సైకిళ్ల కన్నా ఆటోమేటిక్‌ స్కూటర్లే బెస్ట్ అని చెప్పవచ్చు. ఇటీవలి మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తే, భారత ద్విచక్ర వాహన మార్కెట్లో స్కూటర్లకు గిరాకీ బాగా పెరుగుతోంది. ఇందుకు ప్రధానం కారణం కొత్త మోడళ్ల రాక.

మార్కెట్లోకి కొత్త స్కూటర్లు వస్తుండటంతో కంపెనీల మధ్య పెరిగిన పోటీ, ఉత్తమ ఉత్పత్తులను అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని కంపెనీలు తమ స్కూటర్ల మైలేజీని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సరే ఇదంతా అటుంచితే, ప్రస్తుతం భారత మార్కెట్లో లభ్యమవుతున్న అధిక మైలేజీనిచ్చే స్కూటర్లేంటో, వాటి వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

బెస్ట్ మైలేజీనిచ్చే టాప్ 5 స్కూటర్లు!

ప్రస్తుతం భారత మార్కెట్లో లభ్యమవుతున్న అధిక మైలేజీనిచ్చే స్కూటర్లేంటో, వాటి వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

టీవీఎస్ వెగో

టీవీఎస్ వెగో

సగటు మైలేజ్: 45-47 కెఎమ్‌పిఎల్

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 5 లీటర్లు

ఇంజన్: 109.7సీసీ, పవర్: 8 హెచ్‌పి, టార్క్: 8 ఎన్ఎమ్

ధర: రూ.47,692 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హోండా యాక్టివా

హోండా యాక్టివా

సగటు మైలేజ్: 49 కెఎమ్‌పిఎల్

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 5.3 లీటర్లు

ఇంజన్: 109సీసీ, పవర్: 8 హెచ్‌పి, టార్క్: 8.74 ఎన్ఎమ్

ధర: రూ.51,922 (ఆన్-రోడ్, ఢిల్లీ)

సుజుకి స్విష్

సుజుకి స్విష్

సగటు మైలేజ్: 45-50 కెఎమ్‌పిఎల్

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 6 లీటర్లు

ఇంజన్: 124సీసీ, పవర్: 8.58 హెచ్‌పి, టార్క్: 9.8 ఎన్ఎమ్

ధర: రూ.54,404 (ఆన్-రోడ్, ఢిల్లీ)

మహీంద్రా డ్యూరో

మహీంద్రా డ్యూరో

సగటు మైలేజ్: 45 కెఎమ్‌పిఎల్

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 6.5 లీటర్లు

ఇంజన్: 124.6సీసీ, పవర్: 10.87 హెచ్‌పి, టార్క్: 9.0 ఎన్ఎమ్

ధర: రూ.44,688 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

హీరో మ్యాస్ట్రో

హీరో మ్యాస్ట్రో

సగటు మైలేజ్: 35-40 కెఎమ్‌పిఎల్

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 5.3 లీటర్లు

ఇంజన్: 109సీసీ, పవర్: 8 హెచ్‌పి, టార్క్: 9.10 ఎన్ఎమ్

ధర: రూ.51,603 (ఆన్-రోడ్, ఢిల్లీ)

టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ జూపిటర్

టీవీఎస్ జూపిటర్‌ను ఇటీవలే మార్కెట్లో విడుదల చేశారు. కంపెనీ పేర్కొన్న మైలేజ్ లీటరుకు 62 కి.మీ. అయితే, దీని సగటు మైలేజ్ తెలియాల్సి ఉంది. టీవీఎస్ వెగో స్కూటర్‌లో ఉపయోగించిన ఇంజన్‌ను జూపిటర్‌లోను ఉపయోగించారు కాబట్టి దీని సగటు మైలేజ్ కూడా 45-50 కి.మీ. మధ్యలో ఉండొచ్చని అంచనా. జూపిటర్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
With the increasing prices of petrol more and more people are opting to travel by scooters. Daily commuters also find automatic scooters the ideal way to travel and prefer it over geared motorcycles as its easy to negotiate through thick, seemingly impenetrable traffic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X