భారత మార్కెట్లో లభిస్తున్న చవక బైక్‌లు

By Ravi

ప్రస్తుతం తక్కువ ధర కలిగిన మోటార్‌సైకిళ్లకు డిమాండ్ జోరందుకుంది. ఇదే నేపథ్యంలో, అనేక ద్విచక్ర వాహన తయారీదారులు అత్యంత సరమైన ధరకే ఎక్కువ మైలేజీనిచ్చే చవక మోటార్‌సైకిళ్లను అందిస్తున్నారు. ప్రత్యేకించి రూరల్ మార్కెట్ అలాగే మైలేజీనికి ప్రాధాన్యతనిచ్చే అర్బన్ మార్కెట్లలో వీటి వినియోగం గణనీయంగా పెరుగుతోంది.

ప్రతినిత్యం ద్విచక్ర వాహనం ప్రయాణం చేసేవారు, సిటీల్లో ఎక్కువ దూరం సంచరించే వారికి అధిక మైలేజీనిచ్చే తక్కువ ధర కలిగిన మోటార్‌సైకిళ్లు చక్కటి ఆప్షన్‌గా ఉంటాయి. వీటిని కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు. అలాగే, వీటి మెయింటినెన్స్ కూడా ప్రీమియం మోటార్‌సైకిళ్లతో పోల్చుకుంటే తక్కువగా ఉంటుంది.

ఈ కథనంలో, మన మార్కెట్లో లభిస్తున్న అత్యంత పాపులర్ అయిన అలాగే చవకైన మోటార్‌సైకిళ్ల గురించి తెలుసుకుందాం రండి.

భారత మార్కెట్లో లభిస్తున్న చవక బైక్‌లు

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో లభిస్తున్న చవక మోటార్‌సైకిళ్లను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

హీరో హెచ్ఎఫ్ డాన్ - రూ.37,350

హీరో హెచ్ఎఫ్ డాన్ - రూ.37,350

దేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ అందిస్తున్న రఫ్ అండ్ టఫ్, లో మెయింటినెన్స్, బెస్ట్ మైలేజ్ బైక్ ఇది. ఇటు క్లాస్ మార్కెట్లకే కాకుండా అటు మాస్ మార్కెట్లకు కూడా ఇది సరిపోతుంది. ఇందులో కొంచెం స్టయిలిష్ వెర్షన్ కోరుకునే వారు హెచ్ఎఫ్ డీలక్స్ మోడల్‌ను ఎంచుకోవచ్చు. దీని ధర రూ.39,000 లుగా ఉంది.

యమహా క్రక్స్ - రూ.38,455

యమహా క్రక్స్ - రూ.38,455

యమహా అందిస్తున్న ఈ 110సీసీ బైక్ కంపెనీ భారత్‌లో ఆఫర్ చేస్తున్న బైక్‌లలో కెల్లా చవకైనది. పెర్ఫామెన్స్ ప్లస్ మైలేజ్‌ల కలయికే ఈ యమహా క్రక్స్. ఈ బేసిక్ మోటార్‌సైకిల్ హీరో హెచ్ఎఫ్ డాన్ మాదిరిగానే రౌండ్ హెడ్‌ల్యాంప్స్, స్పోక్ వీల్స్, సింపుల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. యమహా బ్రాండ్‌లో కొంచెం ప్రీమియం వెర్షన్ కోరుకునే వారు వైబిఆర్ 110, 125 మోడళ్లను ఎంచుకోవచ్చు. వీటి ధరలు వరుసగా రూ.45,455, రూ.51,555 లుగా ఉన్నాయి.

బజాజ్ ప్లాటినా - రూ.40,346

బజాజ్ ప్లాటినా - రూ.40,346

బజాజ్ నుంచి లభిస్తున్న అత్యంత చవకైన బైక్ బజాజ్ ప్లాటినా. ఈ బేసిక్ 100సీసీ మోడల్ ప్లాటినా లైట్ వెయిట్ డిజైన్‌తో బెటల్ మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఈ చవక బైక్‌లో డోమ్ లైట్, అల్లాయ్ వీల్స్ లభిస్తాయి. అయితే, ఎలక్ట్రిక్ స్టార్ట్, డిస్క్ బ్రేక్ ఆప్షన్స్ లేవు. ఇందులో 125సీసీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

హోండా డ్రీమ్ నియో - రూ.43,150

హోండా డ్రీమ్ నియో - రూ.43,150

జపనీస్ బైక్ కంపెనీ హోండా ఇటీవలే తమ డ్రీమ్ సిరీస్‌లో ప్రవేశపెట్టిన చవక బైక్ 'హోండా డ్రీమ్ నియో'. ఇందులోని హెచ్ఈటి టెక్నాలజీతో కూడిన 110సీసీ ఇంజన్ మెరుగైన మైలేజీని ఆఫర్ చేస్తుంది. అల్లాయ్ వీల్స్, డోమ్ లైట్, స్టయిలిష్ గ్రాఫిక్స్ ఈ బైక్ సొంతం. ఇందులో ప్రీమియం వెర్షన్ కావాలనుకునే వారు హోండా డ్రీమ్ యుగ (ధర రూ.46,670)ను ఎంచుకోవచ్చు.

టీవీఎస్ స్పోర్ట్ - రూ.44,155

టీవీఎస్ స్పోర్ట్ - రూ.44,155

చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి లభిస్తున్న అత్యంత చవక బైక్ ఇది. లో బడ్జెట్‌లో స్పోర్టీ డిజైన్, స్పోర్టీ పెర్ఫామెన్స్, స్పోర్టీ ఫీల్ కోరుకునే వారికి ఇది చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది. కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం ఇది లీటరుకు 87.7 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇందులో కొంచెం ప్రీమియం వెర్షన్ కోరుకునే వారు టీవీఎస్ స్టార్ సిటీ (రూ.46,575)ను ఎంచుకోవచ్చు.

బజాజ్ డిస్కవర్ 100 - రూ.44,498

బజాజ్ డిస్కవర్ 100 - రూ.44,498

బజాజ్ ఆటో నుండి లభిస్తున్న డిస్కవర్ బ్రాండ్‌లో అత్యంత చవకైనది ఈ డిస్కవర్ 100. దీని తర్వాత డిస్కవర్ 100ఎమ్ (రూ.46,000), డిస్కవర్ 100టి (రూ.49,000), డిస్కవర్ 125 ఎస్‌టి (రూ.53,547) మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. డిస్కవర్ 100సీసీ బైక్‌లని డిటిఎస్-ఐ ఇంజన్ మెరుగైన మైలేజీని, సాటిలేని పెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

సుజుకి హయాటే - రూ.45,903

సుజుకి హయాటే - రూ.45,903

జపనీస్ టూవీలర్ కంపెనీ సుజుకి నుంచి లభిస్తున్న చవకైన బైక్ ఇది. ఇందులోని అధునాతన 110సీసీ ఇంజన్ మెరుగైన మైలేజీని అందిస్తుంది. స్టయిలిష్ అండ్ స్పోర్టీ లుక్ ఈ బైక్ సొంతం. ఇందులో ప్రీమియం వెర్షన్ కావాలనుకునే వారు సుజుకి స్లింగ్‌షాట్ 125సీసీ బైక్‌ను ఎంచుకోవచ్చు. దీని ధర రూ.55,911 గా ఉంది.

హీరో స్ప్లెండర్ ప్లస్ - రూ.45,865

హీరో స్ప్లెండర్ ప్లస్ - రూ.45,865

100సీసీ బైక్ సెగ్మెంట్లో ఎన్ని కొత్త బైక్‌లు వచ్చినప్పటికీ స్ప్లెండర్‌కు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. క్లాసిక్ లుక్, కంఫర్టబల్ రైడ్, ఈజీ హ్యాండ్లింగ్, లో మెయింటినెన్స్, మెరుగైన మైలేజ్ వంటి ఫీచర్లు దీని సొంతం. ఇందులో మెరుగైన వెర్షన్ కావాలనుకునే వారు స్ప్లెండర్ ప్రో లేదా సూపర్ స్ప్లెండర్ లేదా స్ప్లెండర్ ఎన్ఎక్స్‌జి లేదా స్ప్లెండర్ ఐస్మార్ట్ (త్వరలో విడుదల కానుంది) మోడళ్లను ఎంచుకోవచ్చు.


గమనిక: ఇందులో పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ మరియు బేస్ వేరియంట్లకు సంబంధించినవి. సమయాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఇవి మారే అవకాశం ఉంటుందని గమనించగలరు.

Most Read Articles

English summary
Here we take a look at some of the more popular and of course, the cheapest commuter bikes in India. These bikes may not be the best commuter bikes, but they offer the best value for money in the two wheeler segment by far.
Story first published: Wednesday, October 16, 2013, 12:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X